పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి అడ్డా. వైఎస్సార్ అక్కడి నుంచి అప్రతిహతంగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. వైఎస్ మరణం తరువాత పులివెందులలో ఆయన కుమారుడు జగన్ గెలుస్తూ వస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డితోపాటు జగన్ ఫోటోలతో పులివెందుల పట్టణమంతా ఫ్లెక్సీలతో నిండిపోయేది. కాంగ్రెస్ తో విబేధించి వైసీపీని జగన్ ఏర్పాటు చేశాక జగన్ ఫ్లెక్సీలు తరుచుగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు జగన్ ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ అందులో ఎక్కడ జగన్ ఫోటో కనిపించలేదు. జగన్ ఫోటో లేకపోవడంపై పులివెందుల ఇదే అంశంపై చర్చించుకుటుంది. అసలు జగన్ లేని వైఎస్ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీని పులివెందులలో ఏర్పాటు చేస్తారని కలలో కూడా ఊహించలేదని చర్చించుకోవడం కనిపించింది.
వైఎస్ వివేకా ఘటన తరువాత కొన్నాళ్ళు జగన్ , అవినాష్ రెడ్డిలు వివేకా విగ్రహాలకు దండలు వేశారు. జయంతి, వర్ధంతులు నిర్వహించారు. పులివెందులకు వెళ్ళినప్పుడల్లా వివేకా విగ్రహానికి నివాళులర్పించేవారు. కానీ ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళాక సీన్ మారిపోయింది. వివేకాకు నివాళి అర్పించడాన్ని వారు నేరంగా భావిస్తున్నారు.
ప్రతిఏటా వివేకా వర్ధంతి వేడుకల్లో పాల్గొనే జగన్ ఈసారి ఆయన విగ్రహానికి నివాళులు ఆర్పించలేదు. వర్ధంతికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వివేకా మద్దతుదారులే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కానీ అందులో జగన్ ఫోటోను తప్పించారు. వైఎస్ కుటుంబంలో చీలికకు ఇదొక సంకేతంగా చెప్పొచ్చు.
ఇక వివేకా ఘటనతో వైఎస్ ఫ్యామిలీ ఇప్పటికే రెండుగా చీలింది. వివేకా కూతురు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఫ్యామిలీ రెండుగా చీలుతుంది. అయితే…సునీత టీడీపీ తరుఫున రాజకీయ అరంగేట్రం చేయనుందని ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుల పక్షాన ఉండటం సునీతకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అందుకే ఆమె వైసీపీ ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీలో చేరనుందని అంటున్నారు.
Also Read : ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య – సునీత సంచలన ఆరోపణలు