ఎమ్మెల్సి కవితను ఈరోజు అరెస్ట్ చేయడానికి ఈడి దాదాపు రంగం సిద్దం చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వార తెలిసింది. సుప్రీం కోర్ట్ లో ఆమె కేసు వేసి ఈ రోజు ఈడి ఎదుట హాజరు కాకుండా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమెకు కూడా తెలుసు. అందుకే చాలా తెలిసివిగా ఈ కేసు మీద స్టే ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ని కోరారు. దానికి సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. కానీ కేసును విచారించేందుకు తీసుకుంది. ఆమె ఈ నెల 24న సుప్రీం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడి నుంచి తప్పించుకుని నేరుగా సుప్రీం కోర్ట్ కి గా వెళ్ళాలని ఆమె ఎత్తుగడ. కానీ అవన్నీ బెడిసి కొట్టడంతో ఆమెకు అన్ని తలుపులు దాదాపు మూసుకున్నాయి.
న్యూ ఢిల్లీలో కవితను ఈ నెల్ 11 న ఈడి తమ కార్యాలయంలో 9 గంటలపాటు విచారించింది. ఆమెను 20 ప్రశ్నలతో సంధించారు. ఆమె చాలా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సంతృప్తి కరమైన జవాబులు రాలేదని ఈడి అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఆమె చాలావరకు తప్పించుకునే ధోరణి చూపారు. పైగా ఆ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళమీద నిందలు మోపినట్లు కూడా తెలిసింది.
మొన్న జరిపిన విచారణలో ఆమెతో పాటు ఆమె మాజీ ఆడిటర్ బుచ్చి బాబు, మరో ప్రధాన సూత్రధారి రామచంద్ర పిళ్ళై తో కలిపి విచారించారు. కానీ ఈ రోజు పథకం ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అందరిని కలిపి ఒకేసారి గ్రూప్ విచారణ జరుపనున్నారు.
ఇందులో ఏ 1 నిందుతుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్య మంత్రి మనిష్ సిసోడియా, ఆడిటర్ బుచ్చి బాబు కాంట్రాక్టర్ రామచంద్ర పిళ్ళైతో పాటు అందరు ఉంటారు. కాబట్టి ఒకరి మీద వేసిన నిందను మరొకరు సహించారు. ఎవరికి వారుగా ఈ కేసులోంచి తప్పించుకోవాలని చూసి పక్కవాళ్ళను ఇరికించేందుకు చూస్తారు. దీనితో అసలు నిజాలు చెప్పి ఆ నింద నుంచి తప్పించుకోడానికి ఎవరికివారు చూస్తారు.
అందుకే ఈడి ఇలాంటి గ్రూప్ విచారణలు జరిపి అసలు నిజాలు కక్కిస్తుంది. కాబట్టి ఈ పద్దతిని ఎంచుకుంది ఈసి. అందరుకలిసి కవిత చేసిన అక్రమాలను బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.