ఆడవాళ్ళ నగ్న విడియోలు తీసేది ఆడవాళ్లేనా?
నిన్నటివరకు మగాళ్ళు మాయమాటలు చెప్పి తన గర్ల్ ఫ్రెండ్, లేదా ప్రేయసి నగ్న వీడియోలు తీసి బ్లాకు మెయిల్ చేసేవాళ్ళు. ఇది 4జి మోసాలు. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి 5జి వచ్చింది. నేరస్తులు కొత్త పద్దతులు అవలంభి స్తున్నారు. సైబర్ నేరాల గురించి తెలుసుకున్న అమ్మాయిలు కూడా జాగ్రత్త పడుతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ నగ్న చిత్రాలు ఎక్కడ తీస్తాడోనని భయపడి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆ కేటుగాళ్ళు 5జి నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ కేటుగాళ్ళు ముందుగా ఒక ‘కిరాయి కేడి అమ్మాయిని’ బుక్ చేసుకుంటాడు. ఆ అమ్మాయికి సిసి కెమెరాలు, సెల్ ఫోన్ లు ఇస్తాడు. దానిని ఎలా వాడాలో, ఎవరి మీద వాడాలో ట్రైనింగ్ ఇస్తాడు. ఓ గొప్పింటి అమ్మాయితో స్నేహం చేయిస్తాడు. ఆ ఇద్దరు హోటళ్లకు, పబ్ లకు వెళ్లే ఖర్చులు కూడా భరిస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం ముదిరేలా చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
ఆ కిరాయి కేడి అమ్మాయి తన స్నేహితురాలికి తన బర్త్ డే ఉన్నదని అబద్దం చెప్పి ఓ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ డ్రెస్ తనకు నచ్చలేదు అని అబద్దం చెపుతుంది. ఆ డ్రెస్ గదిలో తన ముందు వేసుకోమని గారాలుపోతుంది.
సాటి అమ్మయి ముందు సిగ్గేమిటి అని ఆ అమాయకురాలు గదిలో నగ్నగా మారి ఆ డ్రెస్ వేసుకుంటుంది. వీలుంటే ఇద్దరు కలిసి స్నానం చేస్తారు. ఆ కిరాయి కేడి అమ్మాయి ముందుగా నగ్నంగా మారి ఆమెను కూడా నగ్నగా మార్చి డాన్స్ చేస్తుంది, చేయిస్తుంది. అవసరమైతే ఇద్దరు లేస్బిఎన్ లాగా మారుతారు. ఇదంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తుంది ఆ కిరాయి కేడి అమ్మాయి.
ఆ తర్వాత ఆ కిరాయి కేడి అమ్మాయి ఆ వీడియోను కేటుగాడికి పంపుతుంది. అక్కడినుంచి ఈ అమాయకురాలిని వాడు బ్లాకు మెయిల్ చేస్తాడు. తన సెల్ ఫోన్ పోవడం వలన ఆ వీడియో బయటపడింది అని కిరాయి కేడి అమ్మాయి ఏడుస్తుంది. వాడు చెప్పినట్లు డబ్బులు ఇచ్చి ఆ వీడియో సంపాదించాలి అని నీతులు చెపుతుంది. తన జీవితం పాడవుతుంది అని భయపడినట్లు నటిస్తుంది. ఈ అమాయకులరు తీసుకునే ప్రతి చర్యను తెలుసుకుని ఆ కేటుగాడ్ని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడేలా చేస్తుంది. కొంతకాలానికి ఈ కిరాయి కేడి అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆమె సెల్ పని చేయదు.
ఈ మధ్య సైబెర్ క్రైమ్ లో ఇలాంటి కేసులు దాదాపు వంద వరకు నమోదు అయ్యినట్లు తెలిసింది. కాబట్టి అమ్మాయిలు, మీరు ఇకనుంచి అబ్బాయిలతోనే కాదు, సాటి అమ్మాయిలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్టల షాపుల్లో డ్రెస్ మార్చుకునే తప్పుడు మీ పక్కన సేల్స్ గర్ల్ ఉన్నా నమ్మకండి. సినిమా హాళ్ళలోని మూత్రశాలలో మీ పక్కన అమ్మయిలు ఉన్నా నమ్మకండి. కొత్త ఆడమనుషులను అస్సలు నమ్మకండి. ఏ పుట్టలో ఏ పాముందో? ఏ అమ్మాయిలో ‘కిరాయి కేడి అమ్మాయి’ ఉన్నదో చెప్పలేము. జాగ్రతా!