పెళ్లి చేసుకోవడానికి నేటి యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెళ్లి అయితే కుటుంబం అనే పంజరంలో చిక్కుకొని…స్వేఛ్చను కోల్పోతామని ఆలోచిస్తోంది. అందుకే పెళ్లి అని మాట ఎత్తితే రెండు చేతులతో నమస్కరించి తమ ఎంజాయ్ ను తాము చేసుకోనివ్వండి. ఈ పెళ్లి మాట ఎత్తకండి మహాప్రభో అంటూ కుటుంబ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు. బంధాలు, బందవ్యాలు తమకు ఎందుకని పాశ్చాత్య తరహలో లివింగ్ అండ్ రిలేషన్ కు యువత ఆసక్తి చూపుతోంది. పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడే బదులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీకెండ్ మ్యరెజేస్ బెస్ట్ అని చెబుతున్నారు.
వీకెండ్ మ్యారేజ్ అంటే…వీరు కూడా అందరిలాగే పెళ్లి చేసుకుంటారు. కాకపోతే వారాంతంలో మాత్రమే కలుస్తారు. మిగతా రోజుల్లో ఎవరి జీవితం వారిదే. ఎవరి ఖర్చులు వారివే. కలిసి ఉన్న ఆ రెండు రోజులు మాత్రం ఎలాంటి ఖర్చులు చేసినా సగం, సగం భరిస్తారు. పిల్లలు పుడితే పిల్లల ఖర్చులు కూడా సగం , సగం పెట్టుకుంటారు. ఈ వీకెండ్ మ్యారేజేస్ తో లాభాలు ఉన్నాయని నేటి యువత భావిస్తోంది. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే కలిసి ఉండే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ రెండు రోజులు ప్రేమతో కలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా హాయిగా ఎంజాయ్ చేస్తారు.
ఈ వీకెండ్ మ్యారేజ్ తో రెండు రకాల లాభాలు ఉన్నాయి. వీకెండ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. మిగతా రోజుల్లో బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేయవచ్చు. జీవితంలో బెస్ట్ మ్యారేజ్ ఆప్షన్ ఇదేనని ఈ వీకెండ్ మ్యారేజ్ చేసుకున్న వారు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్ రెండు రోజులు అన్యోన్యంగా కలిసి ఉంటామని…కలిసి కబుర్లు చెప్పుకొని ఒత్తిడి నుంచి బయటపడుతామని చెప్పుకొచ్చారు. ఎప్పుడు కలిసి ఉండే దంపతుల కంటే ఈ వీకెండ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు వైవాహిక జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాయని తాజా సర్వేలో తేలింది.
ఈ సంస్కృతి జపాన్ , అమెరికాలో కొనసాగుతోంది. ఇండియాలో మొదలు కాలేదు. కానీ ఇటీవల పాశ్చాత్య సంస్కృతిని మన యువత ఎక్కువగా ఫాలో అవుతుంది కాబట్టి త్వరలోనే ఇక్కడ కూడా అలాంటి ట్రెండ్ వచ్చే అవకాశం లేకపోలేదు.