‘కాట్రాజు’, ‘రసికరాజు’, ‘కాట్రవల్లి’, ‘పెద్ద కళాకారుడు’గా అనే నిక్ నేంలతో పేరు పొందిన తాడికొండ రాజయ్య రాసలీలను సర్పంచ్ నవ్య తొలిసారి బయటపెట్టారు. తీగ కదిలింది. దొంక బయటపడింది. దాంతో ఆయన పబ్లిక్ గా చేసిన వికృత చేష్టలను సోషల్ మీడియా బయట పెట్టింది. మా ‘పోలి ట్రిక్స్’ ఓ అడుగు ముందుకేసే ఆయన చేసిన రాసలీలల విడియోలను వరుసపెట్టి ప్రసారం చేసింది. ఆ వార్త సంచలనం రేపింది.
చివరికి కెసిఆర్ దగ్గరికి కూడా వెళ్ళింది. వెంటనే అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. తాడికొండ రాజయ్యకు కెసిఆర్ తొడపాశం పెట్టారు. మొట్టికాయలు వేశారు.
విడియోలతో సహా నిజం బయటపడింది. కాబట్టి ఇక బుకాయించి ప్రయోజనం లేదని తాడికొండ రాజయ్య తోక ముడిచాడు. తల వంచాడు. నవ్య పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు. ఆమెకు అందరి సమక్షంలో క్షమాపణలు కూడా చెప్పాడు. తన వక్రబుద్ది మార్చుకుని ఇకనుంచి బుద్దిగా మసులుకుంటాను అని ప్రమాణం చేశాడు. ఆ మాటలు నమ్మి అందరు శాంతించారు. నవ్య కూడా శాంతించి క్షమించింది. సమస్య తీరిపోయింది అని అధిష్టానం కూడా చల్లబడింది.
కానీ నిన్న చర్చి లీడర్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న తాడికొండ రాజయ్య ‘యూ’ టర్న్ తీసుకున్నాడు. మళ్ళి మొదటికి వచ్చాడు. తాను మహిళా సర్పంచ్ నవ్య పట్ల ఎలాంటి తప్పు చేయలేదు అని తనను తాను సమర్తించుకుని, ‘గుడ్ బాయ్ అనే బోనాఫైడు సర్టిఫికేట్’ ఇచ్చుకున్నాడు. నవ్య చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఆరోపించాడు.
పైగా ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు శత్రువులు తన పరువు తీయాలని కుట్ర పన్నుతున్నారు అని ఎప్పటిలా నమ్మబలికాడు. నవ్య వయసులో తన కూతురితో సమానురాలు అని వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమెకు ద్రోహం చేసినందుకు ఏడవలేదు. ఆమె తన శత్రువులతో చేతులు కలిపి తనను అల్లరిపాలు చేసింది అని ఆరోపిస్తూ ఏడ్చాడు. అతను ముసలి కన్నీరు కారుస్తున్నాడని అందరు నవ్వుకున్నారు. కానీ అందులో పశ్చ్యతాపం కనిపించలేదు అని గుసగుసలాడుతున్నారు.