తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదృశ్యం కావడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? నిజమే గత మూడు రోజులుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు. పార్టీ నేతలకూ కూడా అందుబాటులో లేరు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలుద్దామన్న నేతలకు కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. దీంతో కేసీఆర్ మిస్సింగ్ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రమంతా టీఎస్ పీస్సీ లీకేజీ వ్యవహారంపై అట్టుడుకుతుంటే…కేసీఆర్ ఈ విషయమై స్పందిస్తారని అంత అనుకున్నారు. అజ్ఞాతం వీడుతారని అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేయాలి. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని… దీని వెనక ఎంతటి వారున్నా ఉపేక్షించబోమని చెప్పాలి. కానీ కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. కనీసం ఓ పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ మిస్ అయ్యాడంటూ తెలంగాణ బహుజన , నిరుద్యోగ విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు…
మూడు రోజుల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే పరీక్ష ప్రశ్న పత్రాలను లీకు చేశారు. అప్పటి నుండి ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదు. ఎవరికైనా కనిపించినచో తెలంగాణ డిజిపి గారికి అప్పగించి, పశ్న పత్రాల లీక్ పై కేసీఆర్ గారిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించగలరని కోరుతున్నాము. అలాగే వీలైనంత త్వరగా టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ గారిని పదవి నుండి తొలగించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని మనవి. తెలంగాణ బహుజన నిరుద్యోగ విద్యార్థులు అంటూ రాసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : సుప్రీంకోర్టులో కవితకు బిగ్ షాక్ – రేపు కవిత అరెస్ట్ పక్కా..!?