ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇందులో కవిత ప్రమేయంపై ఈడీ , సీబీఐలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలను సేకరించాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పన్నెండు మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇటీవల ఢిల్లీ తాజా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ కవితదేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈడీ విచారణకు రావాలని కవితకు నోటిసులు ఇవ్వగానే.. ధైర్యంగా విచారణను ఎదుర్కొంటా..పూర్తిగా విచారణకు సహకరిస్తా..తెలంగాణ ఆడబిడ్డలు ఇలాంటి వాటికీ అసలే బెదరరు. ఈ ప్రాంత ఆడబిడ్డల కళ్ళలో నీళ్ళు రావు.. నిప్పులు వస్తాయంటూ సినిమా డైలాగ్ లు కొట్టింది. మొదటి విచారణలో ఈడీ ప్రశ్నలకు కంగారు పడిన కవిత.. రెండో విచారణ సందర్భంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నట్లుంది. అందుకే ఈ కేసు విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈనెల 11న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను దాదాపు తొమ్మిదిగంటలపాటు విచారించింది. 20ప్రశ్నలను సంధించి ఆమె నుంచి పలు వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొన్నింటికి నాకు తెలియదు.. గుర్తులేదని కవిత తెలివిగా తప్పించుకునేలా సమాధానం చెప్పిందని సమాచారం. కవిత సరైన సమాధానం చెప్పడం లేదని భావించిన ఈడీ అధికారులు ఆమెకు కొన్ని ఆధారాలను చూపించడంతో కంగారు పడినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ కార్యాలయం ఎదుట పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత.. విచారణ అనంతరం బయటకొచ్చి సైలెంట్ గా అక్కడి నుంచి తుర్రుమన్నారు.
గురువారం రెండోసారి ఈడీ విచారణకు కవిత వెళ్లనున్నారు. మొదటిసారి విచారణలో కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈడీ అధికారులు…రెండోసారి కీలక సమాచారం సేకరించి ఆరెస్ట్ చేస్తారని ఆమె భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. రెండోసారి విచారణలో ఈ కేసులో ఏ1 నిందితుడు మనీశ్ సిసోడియా, మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. అందర్నీ కలిపి ఒకేసారి విచారిస్తే కవిత బండారం బయటపడనుంది. దీనిని గరించి ఆమె చివరి అవకాశంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు ఈడీ నోటిసులపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఓ మహిళాను విచారించేందుకు ఈడీ తన కార్యాలయానికి పిలవడం సరికాదని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన నోటిసుల్లో అందరితో కలిపి విచారిస్తామని చెప్పి.. ఒంటరిగా విచారణ జరిపారని పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఫోన్లను సీజ్ చేశారని కవిత తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఈడీ విచారణపై స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరిచింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో ఈనెల 16న ఈడీ విచారణను తప్పించుకోవాలని చూసిన కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ఈ పరిణామాలఈనెల 16న విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : ప్రధానితో కేసీఆర్ కాళ్ళబేరానికి దిగుతున్నారా..?