జనసేన పదో ఆవిర్భావ సభలో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఉద్వేగతభరిత ప్రసంగం సంచలంగా మారింది. ఆ మాటలు మోడీని, అమిత్ షాను, బండి సంజయ్ లకు ఓ హెచ్చరిక ను జారిచేసినట్లు ఉన్నాయి. తాను బిజెపి తో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం అని ఒప్పుకున్నారు. వాళ్ళ హిందూ పదజాలం తనను ఆకర్షించింది అని ఒప్పుకున్నారు. అయితే బిజెపి హిందువులకు మేలు చేసే క్రమంలో మన దేశంలోని మైనారిటీలకు ద్రోహం చేస్తే మాత్రం ఊరుకోను అని సభాముఖంగా ఆయన ఘాటుగా బిజెపికి హెచ్చరికలు పంపారు. బిజెపిని సున్నితంగా మందలించారు.
తాను ఇప్పటివరకు మైనారిటీలకు ఎలాంటి ద్రోహం తలపెట్టలేదు అని పవన్ కళ్యాన్ చెప్పారు. తాను వాళ్ళను ఇష్టపడతాను అన్నారు. వాళ్ళకు ఇబ్బంది కలిగించే ఏ చిన్న పని కూడా చేయలేదు అన్నారు. తాను రోడ్ షోలు నిర్వహించేటప్పుడు లౌడ్ స్పీకర్లో శబ్దం పెద్దగా వినిపించేవి. చుట్టుపక్కల మజీద్ లో ఎవ్వరయినా ముస్లీం సోదరులు నమాజ్ చేస్తుంటే వెంటనే తాను లౌడ్ స్పీకర్ లు ఆపేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పారు. ఈ మాటలు జనం నమ్మకేపోతే లోగడ తాను ప్రసంగించిన వీడియోలు చూసుకోవచ్చు అని చెప్పారు.
అయితే దురదృష్టవశాత్తు తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు మైనారిటీలు తనకు దూరం అయ్యారని బాధపడ్డారు పవన్ కళ్యాన్. తనను మైనారిటీలు అపార్థం చేసుకున్నారు అని వాపోయారు. తాను బిజెపితో చేతులు కలిపినంత మాత్రానా మైనారిటిల మేలు కోరుతాను అని వివరణ ఇచ్చారు. కాబట్టి బిజెపి గనక మైనారిటీలకు ఇబ్బంది కలిగించే ఏ చిన్న పని చేసినా వెంటనే ఆ పార్టీ తో ఉన్న పొత్తును రద్దు చేసుకుంటాను అని అయన సభా ముఖంగా మాటిచ్చారు.
కానీ ఈ హెచ్చరికలు బిజెపి అధిష్టానికి రుచించ లేదు. నిన్న రాత్రి అత్యవసర సమావేశం పెట్టి ఇదే అంశం మీద చర్చించినట్లు తెలిసింది. జనసేన, బిజెపిలో రగిలిన ఈ కారుచిచ్చు ఎన్ని ట్విస్ లు ఇస్తుందో వేచి చూడాలి.