నిన్న జరిగిన ఎం ఎల్ సి ఎన్నికలలో పలు అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు చెప్పడం కాదు, జగన్ ప్రభుత్వంలో ఉద్యోగం చేసున్న బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ జనరల్ డైరెక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరోపిస్తూ ఓ ఘాటు లేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ కు రాసి సంచలనం లేపారు. ఇప్పుడా లేఖ వైరల్ గా మారింది. లోగడ జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయనకు ఎన్నికల నిర్వహణ మీద పూర్తిగా అవగాన ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల తీరును తప్పుబడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఆయన ఓ లేఖ రాశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం కంటే ముఖేష్ కుమార్ మీనా జూనియర్. కాబట్టి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ లేఖ రాశారు. జరిగన ఎన్నికల విధానం గురించి మరోసారి ఆలోచించాలని కోరారు. కానీ ఆ ఎన్నికలను రద్దు చేయాలనీ ఆదేశించలేకపోయారు. ఆ అధికారాలు లేవు కాబట్టి.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రహసనంగా మారిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఐదు పదో తరగతి చదివిన వారిని పట్టభద్రులుగా నమోదు చేసి ఓటు వేయించడం ఏమిటని ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖలో ఘాటు గా నిలదీశారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు మీడియాలో, అన్ని టివి చానళ్లలో కనిపిస్తున్నా ఎన్నికల యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉన్నదని ఆయన నిలదీశారు. ఎవరి ఒత్తిడి మేరకు ఉద్యోగాలు చేస్తున్నారు అని అడిగారు.
నేరాలు, ఘోరాలు జనాలు చూస్తూంటే మీరు ప్రేక్షకపాత్ర ఎందుకు పోషిస్తున్నారు అని ఎద్దేవ చేశారు. ఇంకా రీపోలింగ్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలను తక్షణమే పరిశీలించి చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దీనిని ప్రతిపక్షాలు సరిగ్గా వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎం ఎల్ సి రీ పోలింగ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.