గౌతమ్ అదానీకి ఒక అన్నయ్య ఉన్నాడని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. ఆ ముద్దుల అన్నయ్య పేరు వినోద్ అదానీ అని ఎవ్వరికీ తెలియదు. అతను కూడా తమ్ముడి దారిలో నడిచి పెద్ద పెద్ద కుంబకోణాలు చేశాడని కూడా ఎవ్వరికి తెలియదు. లోతుగా వెళ్ళుతుంటే సమాధిలోంచి ఎముకలు బయటపడినట్లు కుంబకోణాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి.
మోడీ దివేనలతో అదానీ గ్రూప్ గత ఏడాది ఏసీసీ, అంబూజా సిమెంట్ కంపెనీలతో రూ. 85 వేల కోట్లతో డీల్ కుదిరింది. ఇవి పేరుకే పరాయి వాళ్ళవి. వీళ్ళ టైటిల్ అడ్డు పెట్టుకుని గౌతమ్ అదాని కొన్ని అక్రమాలకూ పాల్పడ్డాడు అని తెలిసింది.
ఈ రెండు కంపెనీలతో జరిగిన లావాదేవీలు ఆ కంపెని ఒరిజినల్ యజమానులకు కూడా తెలియకుండా తుది లబ్దిదారుగా అవతారం ఎత్తిన వినోద్ అదానీనే తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల అసలు లబ్దిదారు వినోద్ అదానీ అని ‘ది మార్నింగ్ కాంటెక్ట్స్’ అనే పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. మారిష్సలోని తన కంపెనీ ‘ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్’ ద్వారా వినోద్ అదానీ ఈ కొనుగోలుకు అవసరమైన 1050 కోట్ల అమెరికన్ డాలర్లు. అంటే రూ. 85000 కోట్లు సమకూర్చారని ఆ పత్రిక పేర్కొంది. ఇది కూడా అతి పెద్ద కుంబకోణంగా ఇప్పుడు వైరల్ గా మారింది.
చాలా కాలం కిందటే వినోద్ అదానీ దుబాయ్ లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నాడు. అదానీ గ్రూప్ షేర్ల దందా విదేశాల నుంచి నిధుల సమీకరణల్లో ఇతనిదే కీలక పాత్ర. అయితే ఇప్పటివరకు అయన పేరు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. వినోద్ అదానీకీ తమ గ్రూప్ వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని అదానీ గ్రూప్ ఎప్పటినుంచో బుకాయిస్తోంది. కానీ అన్నా తమ్ముడు తోడూ దొంగలని క్రమంగా బయటపడుతోంది.
కానీ హిండెన్బర్గ్ రీసెర్చి ఈ ఏడాది జనవరి 24న విడుదల చేసిన తన నివేదికలో వినోద్ అదానీ కూడా అదానీ గ్రూప్లో ఒకడని కనీసం151 సార్లు ప్రస్తావించింది. మారిషస్ సైప్రస్ యూఏఈ కరేబియన్ ఐలాండ్స్ వంటి పన్నుల ఎగవేతలో ఇతనికి పేరుంది. ఇతను అనేక డొల్ల కంపెనీలు పెట్టి పలు అక్రమాలకు పాల్పడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడు. అక్కడ అతని ఆట కట్టేసరికి ఆ డ్రామాను ఇండియాలో తమ్ముడితో కలిపి చేసినట్లు తెలిసింది. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమే.