మార్గదర్శిని చిట్ ఫండ్ మూసేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి. రామక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. పిడుగులాంటి ఈ వార్త ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని సీఐడీ శాఖ ఏపీలోని పలు మార్గదర్శి శాఖల ఆఫీసుల్లో, మేనేజర్లు, ఇతర సిబ్బంది ఇళ్లలోనూ తనిఖీలు జరిపారు.
స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, మార్గదర్శిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. అయితే సీఐడీ చర్యలు ప్రారంభించిన తర్వాత కొన్నిఫిర్యాదులు వచ్చినట్లుగా ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామక్రిష్ణ జవాబు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే రంగంలోకి దిగినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ సీఐబీ చీఫ్ సంజయ్ ఈ విషయంలో స్పందిస్తూ, రెండు రోజులుగా మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారులకు తమకు డబ్బులు చెల్లించటం లేదంటూ ఎనిమిది మంది వరుసగా ఫిర్యాదులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వాటిని ఆధారం చేసుకుని తనిఖీలు మొదలు పెట్టామని వివరణ ఇచ్చారు. అయితే ఒక ప్రైవేటు ఆడిట్ ఇచ్చిన ఓ నివేదికను ఆధారం చేసుకొని మార్గదర్శి చిట్ ఫండ్ పై చర్యలు తీసుకోమని చెప్పారు. అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు మాత్రమే సీఐడీ రంగంలోకి దిగినట్లు ఆయన చెప్పారు.
కొన్ని అవకతవకలు జరిగినట్లుగా కొన్ని నివేదికలు అందినట్లు కూడా ఆయన చెప్పారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని చట్టప్రకారం చర్యలు మొదలు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడిప్పుడే మరి కొందరు ఖాతాదారులు బయటికి వస్తూ తమను ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు. అయితే కేసు ఓ కొలిక్కి రావడానికి మరికొన్ని ఆధారాలు కావాలి అన్నారు.
ఈనాడు సంస్థలకు చెందిన అన్ని శాఖలు తెలుగుదేశం పార్టీ కి మొదటినుంచి అండగా ఉన్నాయి. ఎప్పటిలా ఇప్పుడు కూడా టిడిపికీ వంతపాడుతూ, జగన్ సర్కార్ ని ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈనాడు సంస్థలకు మూల స్తంభంమైన మార్గదర్శి నుంచి నరుక్కు రావాలని జగన్ కుట్ర పన్ని ఇదంతా చేయిస్తున్నాడని మార్గదర్శి అధికారులు చెపుతున్నారు. ఆవుల కుమ్ములాటలో లేగ దూడ కాళ్ళు విరిగినట్లు జగన్, రామోజీరావు గొడవలవల్ల ఖాతాదారులు నలిగి పోయేలా ఉన్నారు.