బిఆర్ఎస్ పార్టీ తో చేతులు కలిపి పని చేస్తే పవన్ కళ్యాణ్ కు రూ. 1000 కోట్ల ఇస్తానని కేసిఆర్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఆ మధ్య పుకార్లు పుట్టాయి. దానిమీద పవన్ ఇప్పటివరకు నోరు విప్పలేదు. అయితే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సంధర్బంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక పార్టీ నడపడానికి రూ. 1000 కోట్ల డబ్బు సరిపోదనీ, ఆ మాట కొస్తే పది వేల కోట్లు కూడా సరిపోవని చెప్పారు. పార్టీకి కావలసింది డబ్బు కాదు, ఓ సిద్దాంతం అన్నారు. డబ్బు ఉండి కూడా ఓ సిద్ధాంతం లేని పార్టీలు చరిత్రలో కలిసిపోయి అని చెప్పాడు. పొతే జనసేన దగ్గర డబ్బు లేకపోయినా ఓ సిద్ధాంతం ఉన్నదని చెప్పారు. ఆ సిద్ధాంతమే ఆ పార్టీ ని గెలిపిస్తుంది అని వివరణ ఇచ్చారు. ‘నన్ను కొనినా, నా సిద్ధాంతాన్ని ఎవ్వరు కొనలేదు’ అని ధీమా వ్యక్తం చేశారు.
తన పార్టీకి ఓ జెండా ఉన్నదని, తనకు ఓ ఎజెండా ఉన్నదని అన్నారు. కేసిఆర్ తనకు రూ. 1000 కోట్లు ఇస్తాను అనే వార్త కేవలం గాలి వార్త అని కొట్టి పడేశారు.