ఎమ్మెల్సీ కవితనుద్దేశించి బండి సంజయ్ చేసిన ముద్దు వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండిస్తున్నారు. కవిత విషయంలో బండి సంజయ్ మాట్లాడింది ముమ్మాటికీ తప్పేనని వ్యాఖ్యానించి బండికి ఝలక్ ఇచ్చారు. ధర్మపురి అరవింద్ కూడా బండి కామెంట్స్ ను ఖండించి…ఆయన పవర్ సెంటర్ కాదని… కేవలం సమన్వయకర్త మాత్రమేనని గాలి తీసేయగా ఇప్పుడు అరవింద్ కు మరో నేత జత కలిశారు.
బీజేపీ తరుఫున ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆ పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు ఎంపీ అరవింద్ కు కోరస్ ఇచ్చారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పేరాల శేఖర్ రావు పార్టీలో చాలా సీనియర్ నేత. జాతీయ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంతకాలంగా బండిపై పేరాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కవితపై బండి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయారు.
కల్వకుంట్ల కవిత విషయంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్ధనీయం కాదన్నారు. ధర్మపురి అరవింద్ మాట్లాడింది వంద శాతం సరైనదే అని స్పష్టం చేశారు. బండి సంజయ్ కి పరిణితి లేదని, నియంత అని ధ్వజమెత్తారు. ఆయనవన్నీ బ్లాక్ మెయిల్, సెటిల్ మెంట్ వ్వవహారాలే అని ఆరోపించారు. అన్ని విషయాలను తాను నిరూపించడానికి సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.ఫేస్ బుక్ లో పేరాల శేఖర్ రావు పెట్టిన పోస్ట్….
మిత్రులు, అభిమానులకు నమస్కారం…ధర్మపురి మాట్లాడింది 100% Correct..కిషన్ రెడ్డి గారో,లక్ష్మణ్ గారూ,ఇతర పెద్దలు చేయాల్సిన పని ఆయన చేశారు..అధ్యక్షుని పరిణతి లేని అసందర్భ మాటలు,వ్యవహారం,నియంతృత్వం,అప్రజాస్వామిక చేష్టలు bjp లో ఈ పరిస్థితికి కారణం..అన్ని మసీదుల తవ్వకాలు,ముద్దులు పెట్టడాలు,బ్లాక్మెయిల్,Issues లేవదీసి అంతర్గతంగా settlement లు,సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు,సమన్వయ లోపం,వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, Use and Throw లు-మన పార్టీ సంస్కృతి కాదు, అయినా యధేచ్చగా నడుస్తున్నాయి..
కరీంనగర్ Granites అవినీతిని లేవదీసి అంతర్గతంగా ఒప్పందాలు చేసుకోవడం, Raj News లో జూపల్లి రామేశ్వర్రావు గారి మైనింగ్ అక్రమాల0టూ Serials ఇచ్చి తరువాత settlements చేసుకోవడం, Raj News లో నలుగురు ముఖ్య Bjp నాయకులతో కోట్లు పెట్టుబడి పెట్టించి నట్టేట ముంచి వేయడం, దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్టి Secunderabad Cantonment VC Post ను ఆర్థిక కారణాల వల్ల కొత్తవారికి ధారాదత్తం చేయటం,ఉద్రేకంగా సాగిన Huzurabad ఎన్నికల్లో KCR ను చిత్తుగా ఒడి0చిన ఈటెల రాజేందర్ గారి అద్భుతమైన గెలుపు వాతావరనాన్ని ఖతం చేసిన తీరు,Mafia Style కొత్త కార్య పద్ధతి etc,etc..వీటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి నేను సిద్ధం..
పార్టీలో వినే సంస్కృతి-చర్చించే పద్ధతి మాయమైనప్పుడు Social Media ఆధారమవుతున్నది..ప్రస్తుతం మన పార్టీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు లాగా ఉంది.దీనికి కారణం రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధాలే..KCR-TRS పతనం అవుతున్న సమయంలో,ఇది మన దురదృష్టం.. కేంద్ర పార్టీ పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నా ఉపయోగించుకోలెక పోతున్నామని రాసుకొచ్చారు పేరాల శేఖర్ రావు.
Also Read : బీజేపీ ఆఫర్ కు కవిత అంగీకారం – అరెస్ట్ నుంచి కవిత సేఫ్..?