చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళితే – నాడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి బండి సంజాయి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణం సమయంలో కొమురం భీం జయంతి రోజు టీజర్ ని ఆ సినిమా నిర్మాత డి.వి వి దానయ్య విడుదల చేశారు. కానీ కొమురం భీం పాత్రను పోహించిన ఎన్టీఆర్ నెత్తిన టోపీతో కనిపించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డాడు. మత విద్వేషాలు కల్పించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమురం భీంకు ముస్లిం టోపీ పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. రాజమౌళికి నిజంగా దమ్ము, ధైర్యముంటే నిజాం రజాకార్లకు బొట్లు పెట్టి సినిమా తీయాలన్నారు. అంతేగాక ఆర్ఆర్ఆర్ సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామని ఎన్ టి ఆర్ లా తోడ గొట్టాడు. మీ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తారని మీసం మెలివేశారు. అంతేకాకుండా బరిశెలతో దర్శక, నిర్మాతలను కొట్టి చంపడం కూడా ఖాయమని మాట్లాడారు.
సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని, రీళ్లను తగలబెట్టడం కూడా ఖాయమని బెదిరించారు. ఆ సినిమా షూటింగ్ జరగకుండా బిజెపి కార్యకర్తలతో దాడులు కూడా చేయించాడు.
కానీ నిర్మాత డి.వి. వి దానయ్య ఏమాత్రం భయపడకుండా షూటింగ్ పూర్తి చేయించారు. ఆ సినిమాకు సెన్సార్ కాకుండా బండి సంజయ్ శతవిధాలా ప్రయత్నించాడు. కానీ దాంట్లో ఎలాంటి వివాదస్పద సీన్లు లేవని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సినిమాను ఆపాలని అతను సినిమా ధియేటర్ ల ముందు నానా హంగామా చేశాడు. ఫ్లెక్ సీలు చించేసాడు, వాల్ పోస్టలు కాల్చేసాడు. నిర్మాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి బండి సంజయ్ ఓవర్ ఆక్షన్ కు కట్ చెప్పించాడు.
కానీ ఆర్ఆర్ఆర్ దేశ వ్యాప్తింగా అఖండ విజయం సాదించింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దీనితో బండి సంజయ్ కి అవమానం మిగిలింది. ఆయనను పట్టుకుని నిలదీయాలని తెలంగాణ లోని అన్ని చానళ్ళు చూస్తుంటే తప్పించుకు తిరుగుతున్నాడు.
కానీ తన సోషల్ మీడియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు తెలిపి సిగ్గుతో తలవంచుకున్నారు. నాడు తిట్టినవాడు నేడు పొగడడం ఏమిటి? ఊసరవేల్లిలా రంగులు మార్చే బండి సంజాయ్ ఇకనైనా ఒకే మాట మీద ఉంటాడు అనుకుందాం.
Also Read : బండి సంజయ్ ఓ బ్లాక్ మెయిలర్ – బండారం బయటపెట్టిన బీజేపీ నేత