ఈ రోజునుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ‘ఇందులో విశేషం ఏముంది? ఎప్పుడూ జరిగే సమావేశాలే కదా?’ అని ఆశ్చర్యపోకండి. ఇంతకు ముందు ఉన్న పరిస్తితులకు, ఇప్పుడున్న పరిస్తితులకు చాలా తేడా ఉంది.
కేంద్రం ఈడి, ఐటి, సిబిఐ లను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంది అని చాలావరకు రుజువయ్యింది. ఈ అస్త్రాన్ని ప్రతిపక్షాలు తెలివిగా వాడుకోవాలని ఐక్య మత్యంతో పార్లమెంట్ బరిలోకి దిగుతున్నాయి.
దీనికి బిఆర్ఎస్ నాయకత్వం వహించే అవకశం ఉంది. ఎందుకంటే కవితను ‘ఢిల్లీ లిక్కర్ స్కాం తో మూడు చెవుల నీళ్ళను, ఏడు పెగ్గులలో కలిపి కెసిఆర్ తో తాగిస్తోంది బిజెపి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్య మంత్రి, ఇతర నాయకులు జైలులో మగ్గుతున్నారు. క్రేజ్రివాల్ ని కుడితోపడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకునేలా చేస్తోంది బిజెపి.
దాదాపు అన్ని ప్రతిపక్షాల నాయకులను బిజెపి ఏదో ఒక కేసులో ఇరికించి చుక్కలు చూపిస్తోంది. కాబట్టి బిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టిఎంసి, సమాజ్ వాది లాంటి అన్ని ప్రతిపక్షాలు ఉన్నట్టుండి కలిసిపోయారు. ఇదే విషయంలో బిజెపి కి కూడా పార్లమెంట్ లో పగలే చుక్కలు చూపాలని గట్టిగానే నిర్ణయించాయి. ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే’ అన్నట్లు కదను తొక్కుతున్నాయి. అన్ని అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది.
దీనివలన ఇప్పటివరకు ఈడి, ఐటి, సిబిఐ వలలో చిక్కిన పార్టీలకు కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఈ కేసుల్లోంచి తప్పించుకోనూవచ్చు. కానీ ఇప్పటివరకు ఈడి, ఐటి, సిబిఐ వలలో ఇంకా చిక్కని ప్రతిపక్షాలు ఇకపై చిక్కకుండా ముందు జాగ్రత చర్యా గా ఆందోళన చేయవచ్చు.
అందుకే మునుపెన్నడూలేని విధంగా అన్ని ప్రతిపక్షాలు ఒక్కటై పార్లమెంట్ను స్టంభింపచేసి, బిజెపి మెడలు వంచాలని ప్లాన్ చేస్తున్నాయి. కానీ ఏఒక్కరికి కూడా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి పోరాడాలనే ఆలోచన లేదు. అదే మన రాజకీయం.