చాలాకాలంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ,సీనియర్ నటి పవిత్ర లోకేష్ లు సహజీవనం చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా… పవిత్ర లోకేష్ కు అఫీషియల్ గా రెండో పెళ్లి. అనేక వివాదాల నడుమ పవిత్ర , నరేష్ ల వివాహం జరిగింది. అయితే…పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు.
పవిత్ర మైసూర్ లో జన్మించింది. ఆమె తండ్రి లోకేశ్ ఒక నటుడు, ఆమె తల్లి ఒక టీచరు. పవిత్ర పదవ తరగతిలో ఉన్నప్పుడు లోకేశ్ చనిపోయాడు. పవిత్ర మొదట సినిమాలోకి రావాలని అసలే అనుకోలేదు. ప్రభుత్వఉద్యోగి కావాలని కళలు కన్నది. కానీ తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలో పాలుపంచుకునేందుకు ఆమె సినీ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
దక్షిణాది సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు మదర్ పాత్రలో కనిపించి మెప్పించింది. నరేష్ తో కలిసి నమ్మోహానం సినిమాలో భార్యగా నటించిన పవిత్ర తాజాగా నరేష్ ను రియల్ లైఫ్ లోనూ లైఫ్ పార్ట్ నర్ గా ఎంచుకుంది.ఈ క్రమంలోనే పవిత్ర కు సంబంధించిన ఎన్నో వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవిత్ర నరేష్ ను వివాహం చేసుకోవడానికంటే ముందే ఇద్దరితో సహజీవనం చేసిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నరేష్ కంటే ముందే కన్నడ నటుడు సుచేంద్రా ప్రసాద్ తో ఆమె వివాహం జరిగిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె తనకు సుచేంద్రకు ఎటువంటి సంబంధం లేదు అని తెలిపింది. ఇతని కంటే ముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది పవిత్ర.
ఆ తర్వాత అతనితో మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చి సుచీంద్ర ప్రసాదుతో సహజీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటుంది. అదే సమయంలో…నరేష్ 2018లో సమ్మోహనం సినిమాతో పరిచయం అవడంతో సుచేంద్రను దూరం పెడుతూ వచ్చిన ఈమె ఇటీవల నరేష్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.