ఇటీవలి చాలా కాలంగా యువతీ, యువకులు వావి వరుసలు మరిచి లైఫ్ పార్ట్ నర్ ను ఎంచుకుంటున్నారు. వయస్సులో తమకంటే పెద్దవారిని వివాహం చేసుకుంటున్నారు. వరుసకు సోదరుడు అయ్యేవారినీ, తండ్రి అయ్యేవారినీ పెళ్లి చేసుకుంటూ ఆశ్చర్య పరుస్తున్నారు. తాజాగా ఓ యువతీ తన తండ్రిని వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
అమెరికాలోని లాస్ వెగాస్ లో నివసించే క్రిస్టీ అనే యువతి తనకు తండ్రి వరుసయ్యే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అతనితో శారీరక సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరి పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అనంతరం ఈ జంట పెళ్లి చేసుకుంది. అయితే…క్రిస్టీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు. ఆమె తల్లి మాజీ భర్త. అంటే క్రిస్టీ సవతి తండ్రి. అతను ఆమె తల్లితో విడిపోగానే క్రిస్టీ అతనితో ప్రేమలో పడింది. అనంతరం రిలేషన్ షిప్ లో పెట్టుకొని భార్యా భర్తలుగా మారారు.
అయితే…తండ్రినే వివాహం చేసుకోవడం పై క్రిస్టీ స్పందించిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. తను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఈ పెళ్లి ఒకటని చెప్పడం విశేషం. తాను అదృష్టవంతురాలినని…ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
క్రిస్టీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తండ్రినే వివాహం చేసుకోవడం పై నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.కామెంట్ల తో దుమ్మెత్తి పోస్తున్నారు