న్యూ ఢిల్లీ లిక్కరం స్కాం లో ఈ రోజు ఈడి విచారణకు వెళ్ళిన కవితను చులకన చేస్తూ బండి సంజయ్ మునుపెన్నడూ లేని విధంగా డబుల్ మీనింగ్ లో వ్యంగ్య అస్త్రాలు సందిచారు. ఆయన విలేకరుల సమావేశాలో మాట్లాడుతూ ”కవిత చేసిన లిక్కర్ స్కాం కు ఈడి అధికారులు తిట్టక ‘ముద్దు పెట్టుకుంటారా?’ అని డబుల్ మీనింగ్ లో మాట్లాడారు.
తిట్టక ‘ముద్దు పెట్టుకుంటారా?’ అని మాములుగా వాడే వాక్యమే కావచ్చు. కానీ ఇక్కడ సందర్భం వేరు. ఓ మహిళ విషయంలో, అందులోను ఆమెను విచారించే ఈడి అధికారులల్లో అందరు మగవాళ్ళే ఉన్నారు. గదిలోకి తీసుకెళ్ళి విచారిస్తుండగా ఇలాంటి పదజాలంవాడడం, బిజెఆర్ నాయకులను ఆగ్రహం తెప్పించింది.
అందుకే బిజెఆర్ నాయకులు బండి సంజయ్ మీద నిప్పులు చెరుగుతున్నారు.