ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి నుంచి సమన్లు అందుకున్న ఎం ఎల్ సి కవిత ఈ రోజు 11 గంటలకు ఈడి కార్యాలయంలో హాజరయ్యారు. ఆమెను అనేక ప్రశాలు అడిగారు. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు రాలేదని తెల్సిసింది. అందుకే ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు గొప్ప ట్విస్ట్ ఇచ్చారు. ఆమెతోపాటు 9 మంది నిందుతులను కలిపి ఒకేసారి గ్రూప్ గా మరోసారి ప్రశ్నించనున్నట్లు చెప్పి ఊహించని షాకిచ్చారు.
కవితతోపాటు ఆమె మాజీ సి ఏ బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, అరుణ్ పిళ్లై దినేష్, అరోరా, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్రసింగ్ లను ఒకేసారి గ్రూప్ గా విచారించనుంది.
అంటే దీనివలన ఎవరు అబద్దం చెప్పినా ఇట్టే దొరికిపోతారు. అంతా వాడే చేశారు లాంటి అతితెలివి జవాబులు చెప్పినా ఇప్పుడు అడ్డంగా దొరికిపోతారు. ఒకరు మాట తప్పినా మరొకరు ఒప్పుకోడు. ఒకరిపై మరొకరు నిందలు చేసినా అడ్డంగా దొరికిపోతారు. ఒకరిని ఇరికించాలని మరొకరు చూసినా సిగపట్లు తప్పవు.
అందుకే ఎక్కువ మంది నిందితులు ఉన్న కేసులలలో ఈడి అధికారులు చాలా తెలివిగా ముందుగా విడివిడిగా విచారిస్తారు. తర్వాత అందరిని కలిపి ఒకేసారి విచారిస్తారు. అయితే విడివిడిగా చెప్పిన జవాబులకు, గ్రూప్ లో చెప్పే జవాబులకు సరితుగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా, పక్కవాడిని ఇరికించాలని చూసినా ఇతరులు అడ్డు తిరిగి అసలు నిజాలు కక్కి, అబద్దం చెప్పిన వ్యక్తినే బుక్ చేస్తారు. కాబట్టి ఇది కవితకు గడ్డు పరీక్షనే. చూడాలి ఎం జరగబోతోందో.