-పంజా విసురుతోన్న హెచ్3 ఎన్ 2 వైరస్
-మళ్ళీ కరోనా తరహ ఆంక్షలు
దేశంలో కొత్త రకమైన వైరస్ పంజా విసురుతోంది. ఈ కేసుల సంఖ్య జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ పీడ విరగడ అయిందని సంబుర పడుతున్న నేపథ్యంలో కొత్తగా వెలుగుచూసిన హెచ్3 ఎన్ 2 ఇన్ ఫ్లూయంజా వైరస్ మరింత భయపెట్టిస్తోంది.
జలుబు, జ్వరం, తీవ్రమైన దగ్గు, ఒళ్ళు నొప్పులు ఈ వైరస్ లక్షణాలుగా వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ బారిన పడిన బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బాధితులు యాంటిబయోటిక్స్ తీసుకోవద్దని చెబుతున్నారు. వైరస్ సోకిన వారు డబ్ల్యూహెచ్వో రెఫర్ చేసిన “ఒసెల్టామివిర్” డ్రగ్ వాడాలని వివరిస్తున్నారు.
ఈ ఫ్లూ వైరస్ వలన దేశంలో ఇప్పటివరకు ఇద్దరు కన్నుమూశారు. అదే సమయంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాష్ట్రాల్లో ఈ ఫ్లూ వైరస్ పరిస్థితిపై నీతి అయోగ్ ఆరా తీస్తోంది. యాంటిబయోటిక్స్ వాడకూడదని తెలిపింది. ఈ వైరస్ సాధారణ వేరియంటే అని, స్వల్ప మ్యుటేషన్లు వెలుగుచూస్తుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు ఈ వైరస్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన గుండెజబ్బులు, శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు జన సందేహంలోకి వెళ్ళేటప్పుడు మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ తరువాత జనాల్లో మళ్ళీ నిర్లక్ష్యం అవహించిందని…దాంతో మాస్క్ లను ధరించడం మానేడంతో ఈ కొత్త వైరస్ వ్యాప్తి అధికం అవుతుందని చెబుతున్నారు.
ఇన్ ఫ్లూయంజా కేసులు దక్షిణ భారతదేశంలో అధికంగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఇందుకోసం ఆరోగ్య కార్యకర్తలకు మాస్క్ లను తప్పనిసరి చేసింది. అనవసరంగా గూమిగూడవద్దని ఆంక్షలు విధించింది. ఈనెల పదిన వెయ్యి జ్వర నిర్ధారణ శిబిరాలు, 200 మొబైల్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది.