ప్రముఖ క్యారెక్టర్ నటుడు నరేష్, మాజీ హీరోయిన్ ‘పవిత్ర’ ను నాలుగో పెళ్లి చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న అక్రమ సంభందానికి ‘పవిత్రంగా’ ముగింపు పలికారు. బాగానే ఉండి. మొన్నటివరకు మూడో భార్య రమ్య తిరుగుబాటుతో అతని తల బొప్పిపెట్టింది. మునుపటి ఇద్దరు భార్యల్లా ఆమె తలవంచుకోలేదు.
ఆమె గొడవ పడేందుకు కారణం కూడా అతను పవిత్ర లో అక్రమ సంబడం పెట్టుకోవడమే. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ ఇద్దరు భార్యలను నట్టేట ముంచాడు. కాబట్టి నరేష్ పక్కా ‘స్త్రీ’ లోలుడు అని మూడో భార్య రమ్యకు బాగా తెలుసు.
తన భర్త మరో స్త్రీ తో కులికితే ఏ ఇల్లాలు కూడా ఊరుకోదు. చెప్పుతో కొట్టి నలుగురితో ముఖాన ఉమ్మిస్తుంది. పాపం! రమ్య చేసింది కూడా అదే. అందులో ఆమె తప్పులేదు. అది ఓ ఇల్లాలు బాధ్యత. అసలు తప్పును మొదలు పెట్టింది నరేష్. దానిని రమ్య బయట పెట్టింది. అదే ఆమె చేసిన పాపమా? అలాంటి కామాంధుడు వద్దు అని ఆమె విడాకులు కోరుతూ కోర్ట్ లో దావా వేసింది. ఏ ఇల్లలుకైనా ఇంతకు మించి ఏమి చేయలేదు.
పవిత్రతో తనకు ఎలాంటి అక్రమ సంబధం లేదని నరేష్ మొదట్లో బుకాయించాడు. కానీ నరేష్, పవిత్ర హోటల్లో కులుకుతుండగా రమ్య పోలీసులకు ఫోన్ చేసి రెడ్ హైన్దేడ్ గా పట్టించింది. ‘వ్యభిచార నేరం’ కింద అరెస్ట్ చేయించింది.
దీనితో పరువు పోయిన నరేష్ తన మూడో భార్య రమ్య మీద కసితో ముందూవెనకా ఆలోచించకుడా పవిత్రను నాలుగో పెళ్లి చేసుకుని నలుగురి నోళ్ళు మూయించాడు. రమ్య చేసిన ఆరోపణలు నిజమని నరేష్ తనను తనే నిరూపించాడు. ఇక్కడితో సమస్య తీరిపోయింది అనుకున్నాడు.
కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది. చట్టంలోని ‘హిందూ వివాహం’ నియమ నిభందనల మేరకు భార్య కు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకుంటే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు నరేష్ కూడా ఊచలు లేక్క పెడతాడా? అనే చర్చ తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
తన భర్త రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య లికిత పూర్వకంగా భర్త కు అనుమతి ఇవ్వాలి. అది కూడా ఆమెకు సంతాన యోగం లేనప్పుడు. ఆమె దాంపత్యానికి పనికి రావొద్దు. చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది. కానీ ఇక్కడ నరేష్ ఇలాంటి చట్టాలను పట్టించుకోకుండా తొందరపడి ముచ్చటగా నాలుగో పెళ్లి చేసున్నాడు. అంటే పేనం మీది నుంచి పొయ్యి లో పడ్డాడు. ఇప్పుడు రమ్య కసి తీర్చుకునే అవకాశం ఇచ్చాడు.
లోగడ విజయనిర్మల కూడా ఇలాంటి తొందరపాటు చర్యకు పాల్పడ్డారు. పెద్దలు ఆమెకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. ఆ తర్వార ఆమె సినిమాల మీద మోజుతో భర్తతో కలిసి మద్రాస్ కు వెళ్లారు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. నరేష్ కి ఆమె జన్మనిచ్చారు. ఆమె తొలిసారి ‘సాక్షి’ సినిమాలో కృష్ణ తో కలిసి నటించి ప్రేమలో పడ్డారు. అప్పటికే కృష్ణ కు కూడా పెళ్లి అయ్యింది. పిల్లు కూడా ఉన్నారు.
కృష్ణతో విజయనిర్మలకు అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఆమె భర్త కూడా రమ్య లాగే ఆరోపించాడు. అప్పుడప్పుడే నటిగా ఎదుగుతున్న విజయనిర్మల ఇలాగే తొందరపడి మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా కృష్ణ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె మొదటి భర్త ఆమె మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాడు. అప్పుడు అక్కినేని, ఎన్ టి రామారావు లాంటి పెద్దలు ఆ సమస్యను పరిష్కరించారు.
ఆ రోజులు వేరు. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అయ్యింది. నాటికీ, నేటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు చట్టాలు చాలా కటువుగా ఉనాయి. మరి నరేష్ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.
మొదటినుంచి నరేష్ డి వక్రబుద్దె!
నరేష్ కి మొదటి నుంచి వక్రబుద్ది ఉన్నదని సినిమా పరిశ్రమలో అందరు చెపుతారు, ముఖ్యంగా సినిమా విలేఖరులు. ఒక్క జంధ్యాలతో మినహా ఎవ్వరితోను బాగుండరు అని తెలిసింది. కొత్త దర్శకులు వెళ్లి కథలు చెప్పితే చాలు, ఆ కొత్త నిర్మాతను తన వైపుకు తిప్పుకుని, ఆ దర్శకుడ్ని రోడ్డున పడేస్తాడు. పలానా హీరోని పెడతామని నిర్మాత చెపితే చాలు, ఆ హీరోకు మార్కెట్ లేదని, అతను సినిమా బడ్జెట్ పెంచుతాడని ఫిట్టింగ్ లు పెడతాడు.
తన కొడుకుని హీరో గా తీసుకోవాలని అతని మేనేజర్ గణేష్ తో రాయబారాలు పంపుతాడు. ఆ కొత్త నిర్మాతను జలగలా పట్టి పీడిస్తాడు. తనకు నచ్చిన దర్శకుడ్ని, తనకు నచ్చిన సాంకేతిక నిపుణులు పెడతాడు.
అందుకే కొత్త దర్శకులు అతని చాయల్లోకి పోరు. నానక్ రామ్ గూడలో అతను కట్టిన చిన్న స్టుడియోలో షూటింగ్ లు జరపాలని కండిషన్ లు పెడతాడు. దానికి చెప్పే రెంట్ ఆకాశాన్ని తాకుతాయి అనే టాక్ భయంకరంగా ఉంది. ‘మా’ గొడవల వల్ల ఆయనకు మిత్రుల కంటే శత్రువులే 99 శాతం ఉన్నారు.