ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే లీక్ చేశాయి. పార్టీ మారుతున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగని జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సాంకేతికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ పార్టీ నిర్వహిస్తోన్న ఏ కార్యక్రమంలోనూ ఆయన కనిపించడం లేదు. దీంతో పార్టీ కూడా ఆయన్ను లైట్ తీసుకుంది. రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయిలో ఎక్కడ ఆయనకు పదవులు కట్టబెట్టలేదు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో ప్రాధాన్యత దక్కుతుంది. ఎలాగూ ఏపీపై కూడా బీజేపీ ఫోకస్ చేయడంతో కిరణ్ సేవలు పార్టీకి ఉపయోగపడతాయని ఆయనకు బీజేపీ గాలం వేయొచ్చు. అందులో అనుమానం కూడా అక్కర్లేదు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీ నేతలు సంప్రదింపులు జరపగా…కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయన ఒకే చెప్పి ఉండొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే.. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి తిరిగి కాంగ్రెస్ లో చేరాక పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఎలా నిస్తేజంగా ఉన్నారో.. బీజేపీలోనూ అలాగే ఉంటె ఆయన పార్టీ మారినా ప్రయోజనం ఉండకపోవచ్చు. చూడాలి మరి ఎన్నికల సమయంలోనైనా దూకుడు కొనసాగిస్తారో లేదో.
Also Read : నేను తల్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా… రఘురామకు భరత్ కౌంటర్