క్యాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది. కాకపోతే టాలీవుడ్ లోనే ఎక్కువగా ఇందుకు సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి కానీ, బాలీవుడ్ లో చాలా దారుణంగా ఉంటుంది. బయటకు చెప్పుకోవడానికి వీలు లేకుండా హీరోయిన్స్ ను లైంగికంగా వేధించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
కమిట్మెంట్ ఇచ్చేందుకు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ ఇష్టముంటే ఓకే చెప్పేస్తారు. ఇష్టం లేకపోతే ఇండస్ట్రీ నుంచే తప్పుకుంటారు. కానీ స్టార్ హీరోయిన్స్ కు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయ్యాయంటే నమ్ముతారా..?కానీ ఇది నిజం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కు కూడా ఈ లైంగిక వేధింపులు తప్పలేదు.
విద్యా బాలన్ స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. దక్షిణాదిన ఎలాంటి సినిమాలు చేయకపోయినా ‘ డర్టీ పిక్చర్ ‘ సినిమా ఇక్కడ డబ్ అయి సంచనలనం సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తరువాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో విద్యా బాలన్ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘ కొంతకాలం కిందట ఓ బాలీవుడ్ నిర్మాత ఓ యాడ్ ఫిలిం చిత్రీకరణ కోసం మాట్లాడేందుకు ఓ నిర్మాత రమన్నాడు. ఓ కాఫీ షాప్ దగ్గర కలుద్దామని చెప్పి ఆ తరువాత ఓ గదిలోకి పిలిచాడు. అప్పుడే నాకు విషయం అర్దమై.. డోర్ కు లాక్ చేయకుండా కొంచెం ఓపెన్ చేసి ఉంచాను. ఆ తరువాత ఐదు నిమిషాలు చూసి.. నేను అతనికి సహకరించనని అర్థమై అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది విద్యా బాలన్.