ఎన్నో వాయిదాల తర్వాత చివరికి కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు కెసిఆర్. ఎన్నో పంచాగాలు తిరగేసే, ఎందరో మత పెద్దలతో చర్చించిన తర్వాత చివరికి ఏప్రిల్ 30 అంటే.. వైశాఖ మాసం… ఆదివారం శుద్ధ దశమి మఖ నక్షత్రంలో నూతన సచివాలయ్యాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి ఇప్పటికే అంబేడ్కర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో ఇప్పటివరకు ఎన్నో వివాదాలను నెత్తిన వేసుకున్న కెసిఆర్ ఈ ముహూర్తం పెట్టి మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్నారు. అంబేడ్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14. ఆ రోజే కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఉంటుంది అని లోగడ ఆయన అన్నారు.
అయితే లోగడ పెట్టిన ముహూర్తానికి కొన్ని అవాంతరాలు వచ్చాయి. చివరికి నిర్మాణంలో మంటలు కూడా చెలరేగి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14. కావున అదే రోజు కెసిఆర్ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయిస్తారు అని అందరూ భావించారు.
మొదట్లో కెసిఆర్ కూడా దాదాపు ఏప్రిల్ 14 రోజే ఫిక్స్ చేయాలని నిర్ణయించారు. కానీ ఆరోజు మంచిరోజు కాదని జోతిష్యులు చెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్ ౩౦ రోజు అన్ని విధాలుగా మంచిదని చెప్పేసరికి తన అభిప్రాయం మార్చుకున్నారు. అందుకే ఈ రోజు కొత్త సచివాలయం సందర్శించి, ఏప్రిల్ 30 ప్రారంభోత్సవిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అంటే రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ కంటే ఎవరో రాసిన పంచంగానికే కెసిఆర్ పెద్ద వేయడాన్ని దళిత సంఘాలు జీర్నించుకోలేకపోతున్నాయి. ఈ పిచ్చి మూడ నమ్మకలతోనే వాస్తు బాగోలేదు అని బంగారం లాంటి సచివాలయాన్ని కూల్చారు. ఉన్న అప్పులు చాలవు అన్నట్లు రూ. 620 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారు. ఎప్పరిలా ఆయన మూడ నమ్మకలకే విలువ నిచ్చారు అని మండిపడుతున్నారు. అంబేడ్కర్ నీ పరోక్షంగా అవమాన పరిచారు అని బాధపడుతున్నారు.
కెసిఆర్ కౌంటర్
ఈ విషయం కెసిఆర్ దృష్టికి తీసుకేల్లగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తున్నాము కదా అని సమర్థించుకున్నారు. ఒకే రోజు అన్ని కార్యక్రమాలు చేయడం కుదరదు. కాబట్టి ఏప్రిల్ 30 కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశాను అని వివరణ ఇచ్చారు. దేనికైనా మసి పూసి మారేడు చేయగలదు. కెసిఆర్ రా? మజాకా?