అవార్డు అనేది వెతుక్కుంటూ రావాలి, కానీ రూ. 80 కోట్లు తగలేసి ఆస్కార్ కొనుక్కుంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏం విలువ ఉంటుంది? అని ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాక్యలు వైరల్ గా మారాయి. కొందరిని ఆలోచింప చేస్తున్నాయి. ఈ కామెంట్ తో చాలామంది ప్రముఖులు, సినిమా అభిమానులు ఏకీభవిస్తు ట్విట్టర్ లో తమ మద్దతు ప్రకటించారు. కానీ ఇది జీర్ణంకానీ నాగబాబు దానిని ఘాటుగానే స్పందించారు. పరమ బుతుల్లోకి దిగారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా అనేక రికార్డులను సృష్టిస్తు కొన్ని అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. అయితే తాజాగా ఇందులోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ దిని కోసం రూ. 80 కోట్లు ఖర్చు అయినట్లు రాజ మౌళి, నిర్మాత డి వి వి దానయ్య నోరు జారి తప్పు చేశారు.
ఈ సినిమా ను ప్రమోషన్ చేసినట్లు అయన ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు స్టీవెన్ స్పెల్బర్గ్, జేమ్స్ క్యామరోన్ అపాయింట్మెన్ ‘కొన్నట్లు’ తెలిసింది. మన దేశంలో హీరో, హిరోయిన్ లు ‘అప్పాయింట్మెంట్’ డబ్బులు తీసుకుని బట్టల షాప్ లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, హోటల్ల ఇనాగరేషన్ చేస్తారు. అలాగే అమెరికాలో కూడా దర్శకులు, హీరోలు, హిరోయిన్ లు కూడా ‘అప్పాయింట్మెంట్’ డబ్బులు తీసుకుని సినిమాలకు ప్రమోషన్ చేస్తారు. ఇందులో గోప్పలేదు.
డబ్బులిచ్చి పద్మశ్రీ అవార్డు కొన్నట్లు, డాక్టరేట్ లు కొన్నట్లు, ఇలా డబ్బులు ఎదజల్లి గ్రామి, ఆస్కార్ అవార్డు లు కొనడం ఏమిటని లక్షలాది మంది నెటిజన్లు నెగటివ్ గా కామెంట్లు చేస్తు తమ్మారెడ్డి కి తమ మద్దతు ప్రకటించారు. అయితే దీనిపై లక్షలాది మంది ప్రశంసలు కూడా గుప్పిస్తున్నారు. తమ్మారెడ్డి ని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.
దీనికి చిరంజీవి స్పందించలేదు. కానీ నాగబాబు మాత్రం ఘాటుగా స్పందిచారు. పవన్ కళ్యాణ్ మీదున్న అక్కసుతో జగన్ మనుషులు చేస్తున్న నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని తిట్ల పురాణంలో దుయ్యబట్టారు. మునుపెన్నడూలేని విధంగా ఆయన అమ్మనా బూతులు తిట్టి అందరిని ఆశ్చర్య పరిచారు.
ఆర్ ఆర్ ఆర్ నిర్మాత రూ. 80 కోట్లు తగలేసి ఆస్కార్ కొనుక్కోవడం కంటే ఆ డబ్బుతో 6 సినిమాలు తీయవచ్చు అని తమ్మారెడ్డి ఎద్దేవ చేశారు. దానిని నాగబాబు బాధతో ఖండించారు. ‘నువ్వు కూడా ఆ డబ్బు ఇచ్చి ఓ తెలుగు సినిమాను అక్కడివరకు తీసుకెళ్ళి చూపించు’ అని సవాలు విసిరు.
ఏదిఏమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమాను అక్కడివరకు తీసుకెళ్ళడానికి రూ. 80 కోట్లు ఖర్చు చేశాము అని దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి. వి వి దానయ్య నోరు జారడం తప్పని సినీ పండితులు, రామ్ చరణ్ అభిమానులు బాధపడుతునారు. ఆ మధ్య ఓ పెదమనిషికి పద్మశ్రీ వచ్చింది. ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ దానికోసం చాలా డబ్బు ఖర్చు చేశాను అని నోరు జారారు. అది తెలిసిన కమిటి అతనిని మందలించి ఆ పద్మశ్రీ ని వెనక్కి తీసుకున్నారు.