మీకున్న ఆధార్ కార్డ్ లోని పేరు, దాని స్పెల్లింగ్, ఓటర్ కార్డ్ తో లోని పేరుతో సరిపోవడం లేదా? మీ డ్రైవింగ్ లైసెన్స్ లో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నారా? మీ ఇంటి అడ్రెస్స్ మారితే ఆధార్ కార్డ్ ఆఫీస్, రేషన్ కార్డ్ ఆఫీస్ , ఓటర్ కార్డ్ ఆఫీస్, పాన్ కార్డ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా?
చెప్పులు అరిగేలా అన్ని ఆఫీస్ ల చుట్టూ తిరవవలసిన అవసరం లేదిక. ఇప్పుడు అన్ని సేవలను ఒకే గొడుకు కిందికి తేవాలని కేంద్ర మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త విధానం తీసుకు వస్తోంది.
వీటిని అన్నింటిని ఆధార్ కార్డ్ కి లింక్ చేయప్బోతున్నారు. అంటే మీరు ఒక్క ఆధార్ కార్డ్ లో మార్పులు చేస్తే చాలు. ఆ మార్పులు ఆటోమాటిక్ గా డ్రైవింగ్ లైసెన్స్, రేషన్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి అన్ని విభాగాల్లో మారిపోతుంది. ప్రతి ఆఫీస్ చుట్ట తిరగవలసిన అవసరం లేదు.