కొందరు బిఆర్ఎస్ నేతలు కామాంధులుగా మారి మహిళా కార్యకర్తలను, సర్పంచులను తమ కోరిక తీర్చాలని వేధించే వార్తలు లోగడ వెలుగులోకి వచ్చాయి. కానీ తన కోరిక తీర్చితేనే నిధులు విడులదల చేస్తానని ఓ బిఆర్ఎస్ నేత ఓ మహిళా సర్పంచ్ ఏకంగా బ్లాక్ మెయిల్ చేస్తూ మానసికంగా వేదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె ఎవరో కాదు, జనగామా జిల్లాలోని ధర్మసాగర్ మండలంలోని జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య. ఆమె ఈరోజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తన మానసిక నరకాన్ని వివరిస్తూ ఏడ్చారు. ఆ జిల్లాలోని ఓ బిఆర్ఎస్ నేత ఆమెను కొంతకాలంగా మానసికంగా హింసిస్తున్నాడని ఆమె ఆరోపించారు. మొదట్లో అతను ఫోన్ చేసి తన కార్యాలయానికి పిలిచేవాడు. తర్వాత తనతో పడుకోవాలని పచ్చిగా అడిగేవాడు అని ఆమె ఆవేదన చెందారు. అది తనవల్ల కాదని, మీకు తల్లి, చెల్లి లేరా అని నిలదీస్తే మొరటుగా జవాబు చెప్పాడని ఆమె అన్నారు.
అది భరించలేక ఆమె పైస్టాయి నాయకులకు పిర్యాదు చేశారు. ఈ రోజుల్లో అది సర్వసాధారణం అని ఆ పైస్టాయి నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం తెలిసిన ఆ కామాంధుడు కోపం పెంచుకుని ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. తనను ఎవ్వరు ఏమి చేయలేరు అని అహంకారపూరితంగా మాట్లాడాడు. క్రమంగా ఆమె మీద కసి పెంచుకున్నాడు. ఆమెకు రావలసిన నిధులు ఆపేశాడు.
చిలి చిలికి ఆ గొడవ గాలివానగా మారి పెద్ద పంచాయితిగా మారింది. అది తప్పని నలుగురు పెద్దమనులు మందలించినా ఆ కామాంధుడు మారలేదు. తన పద్దతి ఏ మాత్రం మార్చుకోలేదు.
తనకు రావలసిన నిధులు కేటాయించాలని అతని కార్యాలయానికి వెళ్లి ఆమె బతిమాలింది. తన కోరిక తిరిస్తేనే నిధులు విడుదల చేస్తానని బ్లాక్ మెయిల్ కి దిగాడు. ఆమె అతనిని తిట్టింది. అయినా అతను మారలేదు. నిధులు విడుదల చేయలేదు.
నిధులు ఆగిపోయి గ్రామాలల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తనకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామస్తులు పనులు చేయాలనీ ఒత్తిడి తెచ్చారు. చివరికి ఆమె తన బంగారం కుదవపెట్టి గ్రామాల్లో పనులు చేయించింది.
ఇప్పుడు అధికారికంగా జరిగే కార్యక్రమాలకు ఆమెను పిలవడం లేదు. ఆమె స్వయంగా వెళ్ళినా ఆమెను వేధిక ఎక్కనియకుండా అడ్డుపడ్డారు. అంతేకాకుండా తనను పర్కోక్షంగా తిట్టి అక్కడినుంచి వెల్లిపోయేలా చేస్తున్నాడు అని నవ్య ఆరోపించారు. లోగడ కేటిఆర్ వేలేరులో పర్యటించారు. ఈ విషయం కేటిఆర్ కి చెప్పాలని ఆమె వెళ్ళితే, ఆ నాయకుడు ఆయనను కలవకుండా అడ్డుపడ్డాడు అని ఆమె ఏడ్చారు. ఇంత జరిగినా ఆమె ఆ కామంధురి పేరు బయట పెట్టలేదు. అతని పరువు తీయడం తన టార్గెట్ కాదని చెప్పారు. అది ఆమె సంస్కారం. ఇప్పుడు ఈ విషయాన్ని కేటిఆర్ ఎలా తీసుకుంటారో చూడాలి.