వైఎస్ వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. తనకు సీబీఐ 160సిఆర్పీసి సెక్షన్ కింద నోటిసులు ఇచ్చిందని.. ఆ నోటిసులు ఇస్తే అరెస్ట్ చేయకూడదన్నది ఆయన వాదన. ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయకూడదని మాట్లాడుతోన్న అవినాష్ రెడ్డి ఎందుకు హైకోర్టును ఆశ్రయించారంటే…. అరెస్ట్ చేస్తారేమోనని భయంతోనేనన్నది స్పష్టం అవుతోంది.
అయితే.. సీబీఐ 160CRPC సెక్షన్ కింద నోటిసులు ఇచ్చి అరెస్ట్ చేసినా చేయవచ్చు. ఎందుకంటే విచారణకు సరిగా సహరించడం లేదని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే అవినాష్ రెడ్డి భయంగా చెబుతున్నారు. అరెస్ట్ చేస్తారనే పక్కా సమాచారంతోనే అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 6నే హైదరబాద్ లోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి 4వ తేదీనే నోటిసులు ఇచ్చారు సీబీఐ అధికారులు. అయితే.. తాను ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయని.. ఆరో తేదీన విచారణకు హాజరు కావడం కుదరదని సీబీఐకి లేఖ రాశారు. దాంతో ఈ నెల 10వ తేదీన విచారణకు రావాలంటూ అవినాష్ రెడ్డి ఇంటికెళ్ళి నోటిసులు ఇచ్చారు. శుక్రవారం ఆయన విచారణకు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో.. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.
వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ రెడ్డే ఈ హత్యచేసినట్లు పేర్కొంది. సీబీఐ కౌంటర్ ను చూస్తే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. ముందు జాగ్రత్తలో భాగంగానే ఆయన అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేలా హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : జనసేనకు బిగ్ షాక్ – టీడీపీలోకి నాదెండ్ల మనోహర్..?