తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నవీన్ హత్యకేసులో మరో నిందితురాలిగానున్న నిహారిక విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. నవీన్ తో ప్రేమాయణం మొదలు అతని హత్య వరకు జరిగిన పరిణామాలను వెల్లడించింది. నిహారిక ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం
నేను ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్.. నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం ఇంట్లో కూడా కలుసుకునేవాళ్ళం. ఒక్కోసారి మేము గొడవ పడితే మాకు హారిహర కృష్ణ సర్దిచేప్పేవాడు. అలా మాకు చాలా దగ్గరయ్యాడు. నవీన్ తో గొడవ పడిన ప్రతిసారి హరితో ఇలా జరిగిందని చెప్పుకొని బాధపడేదానిని. ఈ క్రమంలోనే నవీన్ కు నాకు మనస్పర్ధలు వచ్చి విడిపోయాం. ఆ తరువాత హారి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నవీన్ నాతో మాట్లాడటం నచ్చని హారిహరకృష్ణ ఒక్కోసారి నవీన్ ను చంపేసి మనమిద్దరం ఎక్కడికైనా వెళదాం అని అనేవాడు. ఎందుకలా మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తే సరదాగా అన్నానని చెప్పేవాడని నిహారిక చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలోనే హరిహరకృష్ణ ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్ళి నవీన్ ను చంపడానికి కత్తిని కొన్నానని కత్తిని చూపించాడు. తాను సరదాగా అలా మాట్లాడేవాడు కనుక నేను లైట్ తీసుకున్నా. ఇంతలా పగబడుతాడని ఊహించలేదు. ఇక, జనవరి 15న హరి నాకు ఫోన్ చేసి తన స్నేహితులందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాము అని చెప్పాడు. నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడు. కాని ఆ పార్టీ క్యాన్సిల్ అయిందని తరువాతి రోజు ఫోన్ చేసి హరి చెప్పాడు. ఫిబ్రవరి 17న ఉదయం నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికే హరి నాకు ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడు. నవీన్ ఫోన్ చేస్తే నేను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పమన్నాడు. తిరిగి నవీన్ ఫోన్ చేస్తే అదే విషయం చెప్పాను. ఎందుకు ఏమైందని నవీన్ ప్రశ్నిస్తే.. అంతలోనే నేను ఫోన్ కట్ చేశానని చెప్పింది నిహారిక.
ఆ తరువాత హారి నాకు ఫోన్ చేసి నవీన్ నీతో ఇక నుంచి మాట్లాడడంట అంటే నేను సరే అన్నాను. ఆ తరువాతి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని నాకు మెసేజ్ చేశాడు. శివరాత్రి రోజున ఉదయం 9:30 కి.. వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిశాను. హారి పాతబట్టలతో రావడంతో ఎందుకిలా తయారవ్వని ప్రశ్నిస్తే.. నవీన్ ను రాత్రి చంపేశాను. నా బట్టలకు రక్తం అంటితే హసన్ బట్టలు వేసుకున్నానని చెప్పాడు. హసన్ కి కూడా నవీన్ హత్య విషయం తెలుసు. హసన్ తో కలిసే నవీన్ అవయవాలు కల్గిన బ్యాగ్ ను వారి ఇంటికి దూరంగా చెట్లలో పడేశాను అని చెప్పాడు. ఎందుకలా చేశావని ప్రశ్నిస్తే..సమాధానం చెప్పలేదు. ఇక వరంగల్ వెళ్తాను డబ్బులు కావాలంటే 1500ఇచ్చాను. ఫిబ్రవరి 20వ తేదీన నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా… హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్టాప్‌లో నన్ను కలిసాడు.
కాసేపు నాతో మాట్లాడి నవీన్ ను చంపిన చోటుని.. తలపడేసిన చోటును చూపిస్తానని చెప్పి అతని బండి మీద ఎక్కించుకొని చూపించాడు. అక్కడి నుంచి రాజీవ్ గృహకల్ప దగ్గర బ్యాగ్ పడేసిన ఏరియాను.. బ్రాహ్మణపల్లి దగ్గర పడేసిన నవీన్ తలను అతని ప్యాంట్ , కత్తిని దూరం నుంచి హరి నాకు చూపించాడు. అక్కడి నుంచి వెళ్లి అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ బిర్యాని సెంటర్ లో ఇద్దరం తిన్నాం. అక్కడి నుంచి నవీన్ ను చంపిన ప్రదేశాన్ని చూపించి.. నన్ను మా ఇంటి దగ్గర దించేసి వెళ్ళాడు. ఆ తరువాత నవీన్ వాళ్ళ స్నేహితుడు తరుణ్ కాల్ చేసి ‘ నవీన్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. నీకేమైనా తెలుసా..? అని అడిగాడు. నాకేం తెలియదని చెప్పాను. మళ్ళీ అతను కాల్ చేసి.. మీ కామన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట కదా.. అతని నెంబర్ ఇవ్వమంటే హరి నెంబర్ ఇచ్చాను.
ఫిబ్రవరి 21న ఉదయం 10గంటలకు నవీన్ వాళ్ళ మామ.. హరికి ఫోన్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ లో కంప్లైంట్ ఇద్దామని హరిని పిలిచినట్లు నాతో చెప్పాడు. అప్పుడు హరి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఏదైనా హసన్ తో టచ్ లో ఉండమని హరి చెప్పాడు. ఆ తరువాత తరుణ్ నాకు ఫోన్ చేసి.. నవీన్ గురించి ఏమైనా తెలుసా..? అని అడిగితే నాకేం తెలియదని చెప్పాను. నవీన్ వాళ్ళ మామ కూడా ఫోన్ చేస్తుండటంతో.. మా బావ భూపాల్ రెడ్డికి.. మా ఫ్రెండ్ నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడు. అతని ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తునారని చెప్పాను. దాంతో నా ఫోన్ తీస్కొని మా బావ భూపాల్ రెడ్డి మాట్లాడాడు. నేను అడ్వకేట్ ను.. మీ అబ్బాయి గురించి మాకేం తెలియదని చెప్పడంతో మళ్ళీ ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. ఫిబ్రవరి 23న నేను హసన్ కు ఫోన్ చేశా. హరి కనిపించడం లేదని.. వాళ్ళ అక్క, బావ కంప్ల్లైట్ ఇస్తున్నట్లు చెప్పాడు. నన్ను పీఎస్ కు పిలుస్తున్నారు.. నేను వెళ్తున్నాను.. నిన్ను కూడా పిలుస్తారు కావొచ్చు.. ఏదైనా వాట్సప్ చాట్ ఉంటె డిలీట్ చేయమని చెప్పడంతో అంత డిలీట్ చేసినట్లు చెప్పింది.
ఆ తరువాత ఫిబ్రవరి 24న నా ఫ్రెండ్ కు హసన్ ఇంస్టా నుంచి మెసేజ్ వచ్చింది.నిహారికను ఎవరికీ ఫోన్ చేయవద్దు.. ఎవరితో మాట్లాడవద్దని చెప్పు.. అని ఆ మెసేజ్ వచ్చింది. ఇది నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. 24న ఉదయం నేను కాలేజ్ కు వెళ్తుంటే హరి బస్సు దగ్గర నిలబడి ఉన్నారు. వెంటనే బస్సు దిగి హరిని కలిసి కాసేపు మాట్లాడాను. నేను పోలీసులకు లొంగిపోతానని నాతో అన్నాడు. హారి నా ఫోన్ నుంచి హసన్ కు కాల్ చేసి అతని కలిసేందుకు వెళ్ళాడు. ఆ తరువాత మధ్యాహ్నం నాకు కాల్ చేసి హస్తినపురం బస్టాప్ కు రమ్మన్నాడు. అక్కడ హరి నన్ను కలిసి.. హసన్ చెప్పిన విషయాలను నాతో చెప్పాడు. నవీన్ తల, అతని భాగాలు, బట్టలు తీసుకెళ్లి అతనిని చంపిన దగ్గరనే వేయి… లేదంటే మాపైన కూడా అనుమానం వస్తుందని హసన్ చెప్పినట్టు హరి నాతో అన్నాడు.
ఈ నేపథ్యంలో జరిగిన విషయాలన్నీ మా బావకు చెప్పగా… అతను వెంటనే పొలిసు స్టేషన్ లో లొంగిపోవాలని చెప్పడంతో హరి లొంగిపోయినట్లు పూసగుచ్చినట్లు అన్ని వివరాలు వెల్లడించింది.