31ఏళ్ల ఓ మహిళా 13ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకొని గర్భం దాల్చిన సంఘటన సంచలనంగా మారింది. ఇంట్లో ఒంటరిగా ఉండే సదరు మహిళా బాలుడిపై మనస్సు పారేసుకుంది. ఈ క్రమంలోనే అతనితో శారీరక సౌఖ్యాన్ని కోరుకుంది. బాలుడే కదా అని ఆమె ఇంట్లోకి పదేపదే అతను వెళ్ళినా కూడా ఎవరూ పెద్దగా అనుమానించలేదు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చడంలో అసలు విషయం బట్టబయలు అయింది.
అమెరికాలోని కొలరోడా రాష్ట్రానికి చెందిన ఆండ్రియా సెరానో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. పొరుగింట్లో ఉంటున్న బాలుడిని అమితంగా ఇష్టపడేది. ఈ నేపథ్యంలో ఆమె లైంగిక కోరికలను తీర్చుకునేందుకు బాలుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతనికి పదేపదే చెప్పింది. అతను కూడా వయస్సులో చాలా చిన్నవాడు కావడంతో ఎప్పుడు ఈ విషయం లీక్ చేయలేదు.
బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్న సెరానో గర్భం దాల్చడంతో విషయం కాస్త కోర్టుకు చేరింది. మైనర్ బాలుడితో శారీరక సంబంధం నిజమేనని కోర్టులో అంగీకరించింది. తన కడుపులోని బిడ్డకు తండ్రి ఆ బాలుడేనని వివరించింది. సెరానో మాటలతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
మహిళా ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని గమనించి జడ్జిలు ఆమెను ఇంటికి పంపించారు.రూ. 57లక్షల పూచికత్తుతో ఆమెను విడుదల చేశారు. సెరానో- బాలుడి మధ్య రాజీ కుదరడంతో కేసును ముగించారు. అయితే.. సెరానోకు జన్మించబోయే బిడ్డకు ఆ బాలుడే తండ్రి అవుతాడని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.