ఆరునూరైనా ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్, కేసీఆర్ అవినీతి వ్యవహారాలు అమిత్ షాకు అస్త్రాలుగా మారాయి. ఎలాగైనా కేసీఆర్ ను లొంగదీసుకునే మార్గమైతే దొరికింది కానీ రేవంత్ రెడ్డి బీజేపీకి పంటికింది రాయిలా మారాడు. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన రేవంత్ బీఆర్ఎస్ , బీజేపీలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్నారు. రెండు పార్టీల రహస్య మైత్రిని ఎండగడుతున్నాడు. ఇదంతా బాగానే ఉన్న రేవంత్ ఇస్తోన్న హామీలు.. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న అమిత్ షా లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాల సమర్పించిన నివేదికలతో తేటతెల్లమైంది. దీంతో బీజేపీ తెలంగాణలో పెను విధ్వంసాన్ని సృష్టించాలని కుట్రలు చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రామచంద్ర పిళ్ళైను విచారించిన ఈడీ…ఆయన కవిత బినామీగా అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.ఆయన్ను అరెస్ట్ చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే కవితను విచారణకు హాజరు కావాలంటూ నోటిసులు జారీ చేసిన ఈడీ…ఆమెను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ లో కవితే కీలకమని భావిస్తోన్న ఈడీ ఆమెను ఢిల్లీలో అరెస్ట్ చేయనుందని.. ఈమేరకు కేంద్రం తెలంగాణ బీజేపీ నేతలకు సంకేతాలు ఇచ్చిందనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల హుటాహుటినా ఢిల్లీకి రాష్ట్ర నేతలను అమిత్ షా పిలిపించుకున్నది ఈ విషయమై మాట్లాడేందుకునేనని చెబుతున్నారు. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆందోళనలకు దిగతుంది. అదే సమయంలో బీజేపీ నేతలు ప్రతిగా ఏం చేయాలన్న దానిపై రాష్ట నేతలకు అమిత్ షా ఇటీవల సమావేశంలో దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు.
అయితే.. ఇదంతా కాంగ్రెస్ ను దెబ్బకొట్టే లక్ష్యంతో జరుగుతున్నాయని అర్థం అవుతోంది. ఒక్క కవితను అరెస్ట్ చేయడం ద్వారా.. బీఆర్ఎస్ ,బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పి రేవంత్ పాదయాత్రను అడ్డుకోవాలనే కుట్ర ఒకటైతే…కవితకు లిక్కర్ స్కామ్ లో వాటా ఉందని చెప్పి.. బీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాడుతుందని చెప్పడం మరో ఉద్దేశ్యమని అంచనా వేస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహంతో అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అమిత్ షా రాజకీయం ఎప్పుడైనా రాజకీయ అలజడులను సృష్టించి పవర్ ను అందిపుచ్చుకోవాలనే విధంగానే ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా చేతిలో తెలంగాణ అలజడులతో కల్లోలిత ప్రాంతంగా మారనుందని చెబుతున్నారు.