తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయనున్నారా..? మంగళవారం అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్ళైఇచ్చిన సమాచారంతో కవితను విచారణకు పిలవడం ఇందులో భాగమేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటిసులు జారీ చేసింది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఆదేశించింది. మంగళవారం పిళ్ళై ను అరెస్ట్ చేసిన ఈడీ..రిమాండ్ రిపోర్ట్ లో ఆయన్ను కవిత బినామీగా పేర్కొన్నారు. దీనిని పిళ్ళై కూడా అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. పిళ్ళై ను అరెస్ట్ చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే కవితకు ఈడీ నోటిసులు ఇష్యూ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గతంలో సీబీఐ కవితకు నోటిసులు జారీ చేసినప్పుడు విచారణకు హాజరయ్యేందుకు కవిత గడువు కోరారు. హైదరాబాద్ లోని కవిత నివాసంలోనే ఆమెను సీబీఐ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని నోటిసులు ఇచ్చారు కానీ ఎప్పుడు హాజరు కావాలో చెప్పలేదు. ఇప్పటికీ కవితను విచారణకు పిలవలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటిసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.
కవితను అరెస్ట్ చేస్తారా..? అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పటివరకు జరిగిన అరెస్టులని చూస్తె మాత్రం కవితను అరెస్ట్ చేయలేమని అనుకోవడానికి లేదు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కవితే కీలకమని ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఓ అంచనాకు వచ్చారు.దాంతో కవితను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది.