మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈ రోజు హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్టు చేసింది. ఇతను దక్షిణ భారత్ ఆధారిత మద్యం తయారీదారుల సమూహం ‘ఇండోస్పిరిట్స్ ‘లో ఒక భాగస్వామి. ఈ స్కాంలో ఇతని పాత్ర ఏంతో కీలకం. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్ల విలువైన ‘కిక్బ్యాక్లు’ పంపినట్లు ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. ఇతను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన నిందితుడు. దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుల బృందాన్ని కలిగిన ‘సౌత్ గ్రూప్’లో ఇతను ఎంతో కీలక సూత్రదారి. ఈడీ చెప్పిన ఆధారాల ప్రకారం అతనికి కంపెనీలో 32.5% వాటా ఇవ్వబడింది.
ఇతను హైదరాబాద్ ఆధారిత మద్యం వ్యాపారవేత్త మనీలాండరింగ్ ఢిల్లీలో మద్యం లైసెన్సులను పొందటానికి ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇచ్చినట్లు ఈడీ మొదటినుంచి ఆరోపిస్తోంది. సిబిఐ ప్రకారం పిళ్ళై నిందితుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఫ్రేమింగ్ అమలు చేయడంలో పెద్దన్న పాత్ర పోషించిన నిందితుడు అని ఆరోపిస్తోంది. రోజు రోజుకు ఇతని మీద ఉచ్చు బిగిస్తోంది. ఈడి ఏ మాత్రం తొందర పడకుండా, కోర్ట్ లో చుక్కెదురు కాకుండా అన్ని ఆధారాలు పక్కగా సేకరిస్తోందో. ఓపికగా ఒక్కోక్క వికెట్ తీస్తూ పోతోంది.
ఈ రోజు పిళ్ళైని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి ఈడీ తన అదుపులోకి విచారణకు తీసుకుంది. పిళ్ళైని ఇంతకుముందు ఈడీ అధికారులు రెండు రోజులు ప్రశ్నించారు. కానీ ఆశించినంత సమాచారం రాలేదు. ఇతని ఇంట్లో సోదాలు చేసి కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది ఈడీ. కోట్ల విలువైన ఆస్తులు కూడా జప్తు చేసింది.
ఇప్పుడు ఇతను చెప్పే వివరాల మీద కేసు కొత్త మలుపులు తిరిగే అవకశం ఉంది. కవితకు ఈ కేసుకు సంబంధం ఉన్నదని ఇతను ఒక్క మాట చేపితే చాలు. కవితను కూడా అరెస్ట్ చేయడానికి ఈడి సంసిద్దంగా ఉన్నది. కవితను ముందుగా అరెస్ట్ చేయమని కేంద్రం నుంచి బిజెపి పెద్దలు ఈడి ని ఎప్పటినుంచో బలవంతం చేస్తోంది.