టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే యాత్రకు 69మందితో భద్రత కల్పిస్తున్నామని సర్కార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా ..వీటిని రేవంత్ తరఫు న్యాయవాది ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతున్న 69మంది సిబ్బంది కేవలం యాత్ర బందోబస్తు, ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకేనని వాదించారు.
ఈ యాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్టులో రేవంత్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. రేవంత్ పాదయాత్రకు అదనపు భద్రత అవసరం లేదని వాదించిన బీఆర్ఎస్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడు, అందులోనూ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి యాత్రపై ఇటీవల దాడి జరిగిన విషయాన్ని హైకోర్టులో రేవంత్ తరుఫు న్యాయవాది బలంగా వినిపించారు. రేవంత్ యాత్రపై దాడి జరుగుతోన్న సమయంలో పదుల సంఖ్యలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బందోబస్తు సిబ్బంది ఉన్న అడ్డుకోలేదని.. రేవంత్ వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఆయనకు రక్షణ కవచంగా నిలిచారని.. భూపాలపల్లి సంఘటనను హైకోర్టులో గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. రేవంత్ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది.
రేవంత్ చేపట్టిన యాత్రకు అదనపు భద్రత కల్పించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది. బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నేతలకే ప్రాణహాని ఉందని భద్రత కల్పించే ప్రభుత్వం.. జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర చేపడుతుంటే వ్యతిరేక పక్షాలు దాడులు చేస్తుంటే అదనపు భద్రత కల్పించేందుకు అనాసక్తి చూపడం రేవంత్ పై కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా చెప్పొచ్చు.
Also Read : రేవంత్ రెడ్డిని చంపడానికి ప్రభుత్వం కుట్ర?