అల్లు అర్జున్ పెళ్లి రోజు కావడంతో ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. భార్యకు తనదైన శైలిలో విషెస్ చెప్పారు. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ పోస్ట్ చేశారు. ఇక, అల్లు అర్జున్ – స్నేహారెడ్డిలకు బన్నీ ఫ్యాన్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో మరికొందరు మాత్రం కొంటె కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ , స్నేహరెడ్డితో ఏకాంతంగా కలిసున్న ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ నుద్దేశించి… కొండగుట్టలో భార్యతో ఏకాంతంగా గడుపుతున్నారా..? అంటూ సోషల్ మీడియాలో కొంటె కామెంట్స్ చేస్తున్నారు.
2011 మార్చి 6న అల్లు అర్జున్-స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహరెడ్డి – అల్లు అర్జున్ లకు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తరువాత ఇంట్లోని కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మొదట అల్లు అర్జున్ తో పెళ్లి అనగానే స్నేహారెడ్డి తండ్రి ఈ పెళ్లికి అంగీకరించలేదట. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వచ్చి స్నేహారెడ్డి తండ్రితో మాట్లాడినా తన కూతురిని నీ కొడుక్కి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. చివరికి స్నేహారెడ్డి తాను పెళ్ళంటూ చేసుకుంటే అల్లు అర్జున్ ను మాత్రమే చేసుకుంటానని మొండికేయడంతో వీరి పెళ్లికి స్నేహారెడ్డి తండ్రి ఒకే చెప్పాడట.
అల్లు అర్జున్ – స్నేహరెడ్డి దంపతులకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి సంతానం. అబ్బాయి అయాన్. అమ్మాయి అర్హ. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న శాంకుతలం సినిమాలో అర్హ భరతుడి పాత్రతో తెరంగ్రేటం చేస్తోంది. శాకుంతలం టీజర్లో అర్హ లుక్ రివీల్ చేశారు. అర్హ సింహం మీద కూర్చొని రావడం… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఇక స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ వీడియోలు, ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆమెను ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలో అవుతున్నారు.
Also Read : అత్తామామలపై తారకరత్న భార్య వివాదాస్పద వ్యాఖ్యలు