తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.నవీన్ ను అతని స్నేహితుడు హారిహర కృష్ణ అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.ప్రియురాలు నిహారికా రెడ్డి కోసమే హరకృష్ణ ఇదంతా చేసినట్లు చెప్పారు. దాంతో ఈ కేసులో ఏ1 హరిహర కృష్ణ , ఏ2గా హాసన్, ఏ3 నిహారికా లను చేర్చారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు.అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఫిబ్రవరి 17న పార్టీ పేరుతో నవీన్ ను హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత నవీన్ ను హత్య చేసి, అతడి తల,గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను హారిహర కృష్ణ కట్ చేశాడు. ఆ భాగాలను ఓ బ్యాగ్ లో వేసుకుని బైక్ పై బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. అనంతరం నవీన్ శరీర భాగాలను హాసన్ తో కలిసి మన్నెగూడ ప్రాంతంలో పడేశారు. ఆ తర్వాత హసన్ ఇంటికి చేరుకుని రాత్రి అక్కడే ఉన్నాడు హరిహర కృష్ణ.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే బీఎన్ రెడ్డి నగర్ లో ఉండే తన ప్రియురాలి దగ్గరికి వెళ్లి.. నవీన్ ను హత్య చేసిన విషయం చెప్పాడు హరి. అనంతరం ఖర్చుల కోసం రూ. 1500 ఆమె వద్ద తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 20వ తేదీ సాయంత్ర మరోసారి ప్రియురాలి ఇంటికి వెళ్లి, ఆమెను బైక్ పై ఎక్కించుకుని నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొద్ది దూరం నుంచి తన ప్రియురాలికి నవీన్ మృతదేహాన్ని చూపించాడు హరిహరకృష్ణ. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి పలు ప్రదేశాల్లో తప్పించుకుతిరిగాడు” అని తెలిపారు డీసీపీ సాయి శ్రీ. దీంతో నిహారికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.