సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల. ఆమె నటించిన సినిమాల్లో కథలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా శ్రీలీలను చూసేందుకే థియేటర్లకు క్యూ కడుతున్నారంటే..ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా పారితోషకం కూడా పెంచేయడంతో అందుకు దర్శక,నిర్మాతలు కూడా ఒకే చెప్తున్నారు.
ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా సినిమాలు ఉన్నాయి. పది సినిమాలు చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో శ్రీలీలకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. గూగుల్ లో ఈ అమ్మడు గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు. గూగుల్ లో శ్రీలీల గురించి వెతకగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీలీలకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తేలింది. అదేంటి.. 21ఏళ్ల వయస్సులోనే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లైందా..? అని ఆశ్చర్యపోకండి. ఆమె గురు, శోభిత అనే ఇద్దరు అనాధలను దత్తత తీసుకున్నారు. రెండేళ్ళ కిందట ఓ రోజు సినిమా షూటింగ్ కోసం అనాదాశ్రమనికి వెళ్ళగా.. అక్కడ ఈ ఇద్దరి పిల్లలను వెంటనే చూసి దత్తత తీసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలీలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శ్రీలీల 19ఏళ్ల వయస్సులోనే ఇద్దరి పిల్లలను దత్తత తీసుకోవడంపై నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో ఇలాంటి ఆలోచనలు రావడం అభినందనీయమని సోషల్ మీడియాలో ఆమెఫోటోలను షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.