భూమా మౌనిక – మంచు మనోజ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధువరూలను ఆశీర్వదించారు. మంచు లక్ష్మి ఈ వివాహ వేడుకకు అన్ని తానై వ్యవహరించారు.
భూమా మౌనికకు ఆల్రెడీ ఓ కొడుకు ఉన్నాడు. 2016లో బెంగళూర్ కు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తిని భూమా మౌనిక వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతనే ధైరవ్. గణేష్ తో మౌనికకు మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు.ప్రస్తుతం ధైరవ్ మౌనిక వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడంతో ఐదేళ్ళ ధైరవ్ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు మంచు మనోజ్ ప్రకటించాడు.
కాగా పెళ్లైన మరుసటి రోజే ఈ విషయం మీద మనోజ్ స్పష్టత ఇచ్చారు. భూమా మౌనిక కొడుకు బాధ్యత కూడా తనదే అని చెప్పకనే చెప్పాడు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆకర్షించింది. ఇంస్టాగ్రామ్ లో తన చేతులతో మౌనిక చేతులు, ధైరవ్ రెడ్డి చేతులు పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. కామెంట్ గా ‘శివాజ్ఞ’ అని పెట్టాడు. ఈ క్రమంలో మనోజ్ ని నెటిజెన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరు గ్రేట్, మౌనికతో పాటు ఆమె కుమారుడిని కూడా అంగీకరించారు. మీరు చాలా మందికి స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : మోహన్ బాబును పట్టుకొని ఏడ్చిన మౌనిక… అసలు కారణం ఏంటి..?