ఏపీ రాజకీయాల్లో జనసేన దూకుడు పెంచుతోంది. జనసేనను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా సేవలందిస్తోన్న ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా జనసేనతో ఈసారి ముప్పు పొంచి ఉంటుందని జగన్ దృష్టికి తీసుకెళ్ళాయి. అందుకే జగన్ ప్రతిసభలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపించడం రొటీన్ డైలాగ్ గా మారింది.
2019 ఎన్నికలలో జనసేన పార్టీకి 7 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు ని పరిశీలిస్తే జనసేన పార్టీ ఓటు బ్యాంక్ 12 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో జనసేన భారీగా పుంజుకుందని.. దీనిని గ్రహించే జనసేనతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారని అంటున్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన ఒంటరిగా పోటీ చేసినా 20స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి కేటాయించే సీట్లను బట్టి గెలుపు స్థానాలు ఉండనున్నాయి.
2019లో భీమవరం నుంచి పోటీ చేసిన ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి బరిలో నిలిస్తే గెలుపు ఖాయమని సర్వెలో తేలింది. 20నుంచి 25వేల ఓట్ల మెజార్టీ రానుందని తేలింది. ఇక జనసేన పార్టీ గెలుచుకోబోయే రెండవ స్థానం పిఠాపురం. ఇక్కడ ఈ పార్టీకి ఈసారి 50 శాతంకి పైగా ఓట్లు పడుతాయని తెలుస్తుంది. వీటితో పాటుగా గాజువాక, తాడేపల్లి గూడెం , రాజోలు వంటి ప్రాంతాలలో జనసేన జెండా ఎగరేయడం ఖాయమని అంటున్నారు.
భీమవరం, పిఠాపురం, గాజువాక, తాడేపల్లి గూడెం , రాజోలు వంటి ప్రాంతాలే కాకుండా ముమిడివరం, తుని , కాకినాడ రూరల్ వంటి ప్రాంతాలలో కూడా జనసేన గెలుస్తుందని సర్వేలో తేలింది.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కాకినాడ రూరల్ నుండి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అమలాపురం, రాజముండ్రి రురల్, పాలకొల్లు , మండపేట , పెడన ,తణుకు, కొత్తపేట , విజయవాడ ఈస్ట్ , గుంటూరు వెస్ట్ , పెద్దాపురం మరియు అవనిగడ్డ ప్రాంతాలలో కూడా జనసేన పార్టీ ఈసారి భారీ మెజారిటీ తో గెలవబోతుందని టాక్.
Also Read : వెలువడిన సర్వే ఫలితాలు – ఆ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు జనసేన ఖాతలోనే.!