ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావు ఏపీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చారు. టీటీడీ సలహాదారు పదవి చేపట్టాలని కోరగా అందుకు చాగంటి తిరస్కరించారు.
టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటి కోటేశ్వర్ రావును ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నియమించారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని చాగంటి సందర్శించారు. అలాగే, క్యాంప్ కార్యాలయాన్ని అనుకోని పక్కనేనున్న సీఎం సతీమణి భారతిరెడ్డి నిర్వహిస్తోన్న గోశాలను కూడా సందర్శించి బాగుందని కితాబిచ్చారు. ఇక ఆయన పదవి చేపట్టడం ఖాయమని అనుకున్నారు. ఇంతలోనే ఆయన ట్విస్ట్ ఇచ్చారు. పదవిని చేపట్టేందుకు నిరాకరించారు.
టీటీడీకి సలహాలు, సూచనలు చేయడానికి తనకు పదవులు అవసరం లేదని.. తన అవసరం ఎప్పుడు వచ్చినా సహాకరించేందుకు రెడీగా ఉన్నానని చాగంటి స్పష్టం చేశారు. టీటీడీ ఎప్పుడు అవసరమొచ్చినా సహకరించేందుకు సిద్దమని పేర్కొన్నారు. కానీ హటాత్తుగా పదవిని తిరస్కరించారు.
సలహాదారుల పదవులపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే చాగంటికి సలహాదారు పదవిని కట్టబెట్టడం హైకోర్టును దిక్కరించేందుకు అన్నట్లు ఈ నియామకం అన్నట్లు ఉంది. పైగా.. సలహాదారుల పదవులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సలహాదారులు సలహాలు ఇవ్వకుండా రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని విమర్శిస్తున్నారు.