రాజకీయాల్లో ఆశ ఉండాలనే కాని అత్యాశ అసలు ఉండకూడదు. కానీ కల్వకుంట్ల కుటుంబానికి అత్యాశ ఎక్కువ అయింది. తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అయినట్లుగా దేశ రాజకీయాల్లో సక్సెస్ కావాలనే అత్యాశతో పార్టీ పేరును మార్చేశారు. ఇది ఎంత తప్పో రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి తెలియరానుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత తప్పో రుచిచూపించేందుకు ఆ పార్టీ మాజీ, అసంతృప్త నేతలు రెడీ అయిపోయారు.
టీఆర్ఎస్ పేరుతో ఓ ముగ్గురు కీలక నేతలు పార్టీని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి ..లేకపోతే తెలంగాణ రక్షణ సమితి అంటూ రకరకాల పేర్లు తెరపైకి తెస్తున్నారు. వీటిలో ఏది ఖరారు చేస్తారో తేలాల్సి ఉంది. అన్ని పక్కాగా ఆలోచించి పార్టీ పేరును టీఆర్ఎస్ ను వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు ముగ్గురు కీలక నేతలు.
ఈ ముగ్గురు కీలక నేతలు ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారుగా చెబుతున్నారు. అయితే… ఆ ముగ్గురు నేతలెవరు అన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ ముగ్గురిలో ఇద్దరు టీఆర్ఎస్ మాజీ ఎంపీలని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖమ్మం మాజీ ఎంపీ దాదాపు టీఆర్ఎస్ తో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు జాతీయ పార్టీలో కొనసాగుతున్న అక్కడ ఆయనకు సరైన ప్రాధాన్యత లేదు.
కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నేత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నారు. తనపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని..దెబ్బకు దెబ్బతీయాలనే లక్ష్యంతో సదరు నేత ఉన్నాడని తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలూ బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాని వీరు ఎంచుకున్న ఫ్లాట్ ఫామ్స్ సరిగా లేవనేది ఈ నేతల బాధ. అందుకే వ్యూహాత్మకంగా ఈ పని చేసినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది్ బీఆర్ఎస్‌కే నష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.