తెలంగాణలో వరుసపెట్టి దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు నటి శ్రీరెడ్డి. ప్రేమ వ్యవహారంలో నవీన్ ను అతని స్నేహితుడు హరి హతమార్చడం.. నాలుగేళ్ల పసివాడిని నాలుగు వీధి కుక్కలు కరిచి చంపినా..ర్యాగింగ్ తో ప్రీతి అనే మెడికల్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్నా.. శ్రీచైతన్య కాలజ్ వేధింపులకు ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నా… కేసీఆర్ , కేటీఆర్ లకు చిన్న చీమ కూడా కుట్టినట్లు లేదన్నారు శ్రీరెడ్డి. ఎవరమై పోయినా తమకు సంబంధం లేదనే తరహాలో కేసీఆర్ వ్యవహారశైలి ఉందని ఆమె ఏకిపారేశారు. ఇలాంటి ఘటనలు వరుసపెట్టి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలని… లేదంటే ఇలాంటి దారుణకాండలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉందని శ్రీరెడ్డి తెలిపారు.
వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల పసివాడు చనిపోతే జీహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక కేసీఆర్ అసలే మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాత్విక్ ఆత్మహత్యపై అతని తల్లి టీవీ9తో మాట్లాడిన వీడియోను వినిపించిన శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఆ తల్లి కడుపు కోతకు మీకెలా తెలుస్తుంది కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాలేజ్ ముందు బైటాయిస్తే లా అండ్ ఆర్డర్ గుర్తుకోస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే.. చనిపోయింది మీ బిడ్డలు కాదు కదా.. అంటూ మండిపడ్డారు.
ఇటీవల కేటీఆర్ కొడుకు హిమాన్షు ఎదో సాధించాడని తెగ ప్రశంసించిన ప్రభుత్వ పెద్దలు…ఇతర తల్లుల బిడ్డలు పిట్టల రాలిపోతుంటే ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శ్రీరెడ్డి తెలిపారు. దేశానికి సేవ చేయాలి..తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులు కాలేజ్ లకు వస్తే కార్పోరేట్ కాలేజ్ లు ఆ విద్యార్థులను బలి తీసుకుంటే కేసీఆర్ ,కేటీఆర్ లు స్పందించరా..? అని ప్రశ్నించారు. ఉద్యమ నేత అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. ఓ పిల్లాడిని ఓ కాలేజ్ యాజమాన్యం ప్రాణాలు తీసుకునేలా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.
ప్రీతి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తీరు అమానవీయంగా ఉందని శ్రీరెడ్డి భావోద్వేగంతో అన్నారు. కనీసం ప్రీతి మృతదేహాన్ని ఇంటి గుమ్మం కూడా ఎక్కించలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న వరుస సంఘటనలతో కళ్ళు చెమర్చని వారెవరూ లేరని కంటతడి పెట్టుకున్నారు. అసలు హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు ఏమైందని ప్రశ్నించిన శ్రీరెడ్డి…నీ కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసు ఏమైందని కేసీఆర్ ను నిలదీసింది.
కేసీఆర్ వైఫల్యాలను ఎత్తిచూపిన వాళ్ళను కిడ్నాప్ లు చేసి అరెస్టులు చేస్తున్నారని.. నన్ను అరెస్ట్ చేసినా డోంట్ కేర్ అంటూ స్పష్టం చేసింది శ్రీరెడ్డి. అరెస్ట్ చేసినా తను భయపడనని తేల్చి చెప్పింది. ఓయూ విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేసిన కేసీఆర్ అదే విద్యార్థుల మీద ప్రతాపం చూపిస్తాడా అని కడిగేశారు. కేసీఆర్ పాలనకు ముగింపు పలికేంత వరకు నేను నిద్రపోను అంటూ హెచ్చరించారు.
Also Read : మా ఇంటికి వస్తావా, నన్నే మీ ఇంటికి రమ్మంటావా? మహాసేన రాజేష్ గురించి శ్రీరెడ్డి