ఏపీ ముఖ్యమంత్రి జగన్ మెప్పు ఉంటేనే వైసీపీలో ఎవరైనా కీలక నేతగా చెలామణి అవుతారు. లేదంటే వారంతా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి లెక్కే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఇదే సీన్ కనిపిస్తోంది. ఇటీవల కొంతకాలంగా వైసీపీ నేతలెవరూ విజయసాయిరెడ్డిని కలవడం లేదు. పార్టీలో ఒకప్పుడు నెంబర్ 2గా విజయసాయిరెడ్డి కొనసాగారు. అలాంటి నేతపై జగన్ నమ్మకం కోల్పోయారు. కారణం ఏంటో తెలియదు కానీ విజయసాయిని ఎవరూ కలవోద్దని హైకమాండ్ ఆదేశించినట్లు కనిపిస్తోంది.
వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఒక్కరే కనిపిస్తున్నారు. మొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విశాఖ అభివృద్ధి పనుల కోసమే కలిసినట్లు చెప్పారు. విశాఖలో ఇన్వెస్ట్ మెంట్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కీలక సదస్సుకు విజయసాయిరెడ్డికి ఆహ్వానం అందకపోవడం వైసీపీలో ఎదో జరుగుతుందన్న అనుమానాలను పెంచేస్తోంది. విజయసాయిరెడ్డికి బడా,బడా పెట్టుబడిదారులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన ద్వారా పెట్టుబడిదారులతో పరిచయాలు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చు. కాని అందుకు ఏపీ సర్కార్ సిద్దంగా లేదు.
కొంతకాలంగా వైసీపీలో విజయసాయిరెడ్డి దూకుడు తగ్గిపోయింది. గతంలో నెంబర్ 2గానున్న విజయసాయిరెడ్డి స్థానంలో సజ్జల కొనసాగుతున్నారు. ట్విట్టర్ లో చెలరేగిపోయే విజయసాయిరెడ్డి అకౌంట్ కొన్నిరోజులుగా కనీసం కూత కూయడం లేదు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలను అర్థం చేసుకొనే విజయసాయిరెడ్డి మునుపటి దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి… పీఎం కిసాన్ పథకానికి మీట నొక్కుతున్న సమయంలో… చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. జగన్ ఇప్పుడు మీట నొక్కుతున్నారు కానీ.. ఒక రోజు ముందే అకౌంట్లలో ప్రధాని మోదీ నిధులు జమ చేశారని చెప్పేలా ఆ ట్వీట్ ఉంది. దాంతో అది వైరల్ అయింది.
ఈ ట్వీట్ జగన్ దృష్టికి వెళ్లిందని..విజయసాయి రెడ్డిపై ఆయన సీరియస్ అయ్యారని…త్వరలోనే ఆయనకు షోకాజ్ నోటిసులు జారీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. వాటిపై సరైన సమాధానం చెప్పకపోతే విజయసాయిరెడ్డిని పార్టీని నుంచి సస్పెండ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అంటున్నారు.
Also Read : వెలువడిన సర్వే ఫలితాలు – ఆ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు జనసేన ఖాతలోనే.!