తారకరత్న మరణంతో విషాదంలో మునిగిపోయిన నందమూరి కుటుంబం ఈ విషాదం నుంచి ఇంకా తెరుకోలేకపోతుంది. ఇటీవలే ఆయన పెద్దకర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇక తారకరత్న చనిపోయిన రోజు నుంచి అతని భార్య అలేఖ్య రెడ్డి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉంది.
ఆమె కంటతడి పెట్టని క్షణమంటూ లేదు. భర్తని నిత్యం తలచుకొని ఏడుస్తూనే ఉంది. తారకరత్నతో తనకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో రోజూ పోస్టులు చేస్తోంది అలేఖ్యరెడ్డి. ఆమె పెడుతోన్న పోస్టులను చూస్తోన్న నెటిజన్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషాదం నుంచి త్వరగా కోరుకునేలా భగవంతుడు నీకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారు.
భర్తే ప్రపంచంగా బ్రతుకుతున్న అలేఖ్యరెడ్డి తారకరత్నను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఇంస్టాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అంతే కాకుండా తారకరత్న తనకి చివరిగా రాసిన లేఖని పోస్ట్ చేస్తూ ‘జీవితం లో నువ్వు నేను ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలను ఎదురుకున్నాము. చివరికి వాటి అన్నిటినీ విజయవంతంగా ఛేదించి మనకంటూ ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పర్చుకున్నాము.ఇక నుండి మనం ప్రశాంతం గా జీవించొచ్చని కలలు కన్నాము, ఇంతలోపే ఇదంతా జరిగిపోయింది.నిన్ను నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు. కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అంటే తారకరత్న తల్లితండ్రులే అయి ఉంటారని.. వారినుద్దేశించే అలేఖ్యరెడ్డి ఈ కామెంట్స్ చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. అలేఖ్య రెడ్డిని తారకరత్న పెళ్లి చేసుకోవడాన్ని అతని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కుటుంబ సభ్యులను కాదని అలేఖ్యను పెళ్లి చేసుకోవడంతో తారకరత్నను కొన్నాళ్ళు దూరం పెట్టారు.
తారకరత్న తన నుంచి దూరమయ్యాక అలేఖ్యకు గతమంతా గుర్తొచ్చి ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చునని చెబుతున్నారు. ఆమె చేసిన పోస్ట్ అయితే సంచలనంగా మారింది.