మాజీ మంత్రి,వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై చాలా కాలంగా అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో ఉంది. కాకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సాహసించడం లేదు.
తాజాగా విజయవాడలోని గవర్నర్ పేట సీఐ సురేష్ కుమార్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. కొడాలి నాని బిజీగా ఉండటంతోనే విచారణకు హాజరు కాలేదని చెప్పగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కొడాలి నానిపై పెండింగ్ లోనున్న అరెస్ట్ వారెంట్ ను వెంటనే అమలు చేయాలనీ సీఐని ఆదేశించారు. దీంతో కొడాలి నానినీ ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
టీడీపీ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కొడాలి నాని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్ వే లో ర్యాలీ నిర్వహించారు. పోలిసుల ఉత్తర్వులు ఉల్లంఘించారని.. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారాణే ఆరోపణల పై గవర్నర్ పేట పొలిసు స్టేషన్ లో అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుల విచారణకు కొడాలి నాని హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాన్ని పోలీసులు అమలు చేయడం లేదు. వాయిదాలకు హాజరై ఉంటే అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేది కాదు.
ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే విచారణకు హాజరు కావడం లేదని..న్యాయస్థానాన్ని లెక్క చేయడం లేదని వారెంట్ జారీ అయింది. అయినా కోర్టును ఖాతరు చేయకపోవడంతో తాజాగా కోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఆయనను అరెస్ట్ చేసి కోర్టుముందు హాజరు పరిచినా బెయిల్ వచ్చే అవకాశం ఉంది.అయినప్పటికీ కొడాలి నాని ఎందుకు ఈ పని చేయడం లేదో.
Also Read : అయ్యో పాపం జగన్ కు పెద్ద కష్టమొచ్చి పడిందే .. అందుకే ఈ తిప్పలు..!