మల్లారెడ్డి ఎక్కడున్నా..ఏం చేసినా..ఏం మాట్లాడినా విశేషమే. వార్తా సంస్థలకు ఆయనే పెద్ద వార్త. జబర్దస్త్ చూసి విసుగు పుట్టేవారికీ హాస్యాన్ని పంచె పొలిటికల్ కమెడియన్. శాసన సభలోనూ, బయట కూడా ఒకేలాగా ఉంటారు. ఆయన ప్రసగించే సమయంలో కేసీఆర్ ను కాకా పట్టడం టార్గెట్ గా పెట్టుకుంటారు. కేటీఆర్ మనస్సు చూరగొనాలని ట్రై చేస్తారు. ప్రజల గురించి ఆయనకు అస్సలు సంబంధం లేదు.
అభివృద్ధి విషయంలో అందరిది ఒక లెక్క ఉంటే మల్లారెడ్డి చెప్పే వాదన మరోలా ఉంటుంది. పని చేసే వ్యక్తులు పని చేసే చోటుకు ఒకప్పుడు నడుచుకుంటూ వస్తుండేవారు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సొంత వాహనాలపై పనికివస్తున్నారు. ఇది కేసీఆర్ హయంలో జరిగిన అభివృద్దికి సూచిక అని మల్లారెడ్డి చెబుతుంటారు.
తన కాలేజ్ లో చిరంజీవి పుట్టిన రోజున వేలాది మంది విద్యార్థులను సమీకరించి శుభాకాంక్షలు చెప్పగలడు. డీజే టిల్లును తీసుకొచ్చి ఆయనతో కలిసి స్టెప్పులు వేయగలడు. అంతేకాదు.. రెడ్డి సామజికవర్గానికి చెందిన అమ్మాయిలు చెప్పిన మాట వినరని.. సాయంత్రమైతే చాలు పార్టీలంటూ బయటతిరుగుతారని మాట్లాడగలడు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అంబేద్కర్ గురించి మాట్లాడకుండా కేసీఆర్ నామస్మరణ చేయగల పోలిటికల్ లీడర్ ఆయనొక్కరే.
పేరుమోసిన కమెడియన్స్ కూడా పంచని హాస్యాన్ని ఒక్కడే పండించగలడు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే వ్యక్తిగత దూషణలకు దిగుతాడు. మూతిమీద మీసం లేకపోయినా మీసం మెలేసి తొడకొడుతాడు. తాను యూత్ ఐకాన్ అని చెప్పుకుంటాడు. ఇలా సంబంధం లేకుండా మాట్లాడటం, వ్యవహరించడం ఆయన ప్రత్యేకత.
ఇలా ప్రతిసారి తనదైన వ్యవహారశైలితో వార్తల్లో నిలిచే మల్లారెడ్డి మరోసారి తన వ్యవహారశైలి ఎంత భిన్నంగా ఉంటుందో చాటిచెప్పాడు. నలుగురు చేసినట్లుగా తాను చేస్తే ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నారో ఏమో కాని కొత్తగా ట్రై చేశాడు. ఇక ఇటీవల రాష్ట్రంలో గుండెపోటు తాలూకు మరణాలు ఎక్కువైన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గుండెపోటుకు వచ్చినప్పుడు రోగికి చేయాల్సిన సిపిఆర్ పై ట్రైనింగ్ ఇచ్చింది. దీనికి వైద్య మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తోపాటు మల్లారెడ్డిలు హాజరయ్యారు.
కానీ ఎక్కడికి వెళ్లినా మీడియాను అటెన్షన్ చేసే మల్లారెడ్డి.. ఈసారి కూడా తన విచిత్రమైన ప్రవర్తనతో అందరి మొహాల్లో నవ్వులు పూజించాడు. సిపిఆర్ ట్రైనింగుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఒక ఆర్టిఫిషియల్ బొమ్మను అలా గట్టిగా ఒత్తుకుంటూ పోయాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు. మల్లారెడ్డి చేస్తున్న అతిని తట్టుకోలేక మంత్రి కేటీఆర్ ఇక చాలు మల్లన్నా..ఆపు అంటూ మల్లారెడ్డిని ఆపాడు.
ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది.