కరోనా వైరస్ స్టాయిలో విరుచుకుపడుతున్న ‘అడినో వైరస్’ మన దేశంలో కూడా ప్రవేశించింది. గడచినా 24 గంటల్లో ఒక్క పక్షిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఈ వ్యాదితో ఐదు గురు చిన్నారులు చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్ అప్పుడే పుట్టిన శిశువుల నుంచి రెండేళ్ళ పిల్లలకు ఎక్కువగా సొకుతోంది అని డాక్టర్ లు చెపుతున్నారు.
ఇప్పటివరకు తెలిసిన సంచారం ప్రకారం ఈ వైరస్ చిన్నారుల శ్వసకోస వ్యాదితో చనిపోయేలా చేస్తోంది. కోల్ కత్తా మెడికల్ కళాశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇద్దరులు చిన్నారులు చనిపోగా, బి సి రాయ్ పి జి పెడియాట్రిక్ సైన్సెస్ లో మరో ముగ్గరు చనిపోయారు.
రోగం లక్షణాలు
పక్షిమ బెంగాల్లో గత కొన్ని రోజులుగా చిన్నారులు దగ్గు, జలుబు, శ్వాసకోస రోగాలతో వేలాదిగా బాధపడుతున్నారు. రెండేళ్ళ పిల్లలు నిదురలో పెద్దగా గురక పెడుతున్నారు. చాలామంది పిల్లలు వెంటిలేటర్ల మీద ఉన్నారు. డిసెంబర్ నుంచి నిన్నటి వరకు దాదాపు 15 మంది చనిపోయినట్లు అనధికారికంగా తెలిసింది. ఇంతకు మించిన లక్షణాలు ఇంకా బయటపడలేదు.
ఇది క్రమంగా అన్ని రాష్ట్రాలకు పాకేలా ఉండండి డాక్టర్ లు ఆందోళన చెందుతున్నారు. జాగ్రాత్త.