ఏపీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకున్నట్లుంది. అందుకే జనసేన, టీడీపీలను విడివిడిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. పొత్తులతో వచ్చినా, ఒంటరిగా వచ్చిన వైసీపీ ప్రభంజనంలో టీడీపీ, జనసేనలు తుడిచిపెట్టుకుపోతాయని ఇన్నాళ్ళు వ్యాఖ్యానించిన జగన్ ఇప్పుడు మాత్రం ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ మాట్లాడుతున్నారు. ఆయన నాలుక మడతేశారు అంటే.. రెండు పార్టీల పొత్తు కుదిరితే వైసీపీ చిత్తవుతుందనేది జగన్ భయం. అందుకే ఆయన తాము ఒంటరిగా పోటీ చేస్తాం.. మీరూ ఒంటరిగా పోటీ చేయండని సవాల్ చేస్తున్నారు.
టీడీపీ, జనసేనలు కలిస్తే ఇబ్బంది అవుతుందని జగన్ భయం
దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175స్థానాల్లో పోటీ చేయాలి. అది కూడా ఒంటరిగా పోటీ చేయాలి. అలా ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యముందా..? అని టీడీపీ , జనసేనలకు సవాల్ విసిరారు. తన సహజశైలిలో టీడీపీ,జనసేనలపై తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ చేసే గొప్పదనాన్ని చెప్పుకున్నారు. వైసీపీ విజయాన్ని ఆపలేరని అంత ధీమా చెబుతున్నా జగన్..టీడీపీ, జనసేనలను ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలనీ సవాల్ విసురుతున్నారో ఆయనకు తెలియాలి.
జనసేనను దెబ్బతీసి.. కాపు సామజిక వర్గాన్ని చీల్చేందుకు జగన్ ప్రయత్నాలు..?
టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోకుండా ఉంటుంది. అది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. టీడీపీ , జనసేనలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి పరజయంఖాయమని నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి.దీంతో జగన్ వ్యూహం ప్రకారమే టీడీపీ, జనసేనకు ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా తనదైన ప్రయత్నాలు చేయిస్తోన్న జగన్.. పవన్ ను ఒంటరి చేసేందుకు బీఆర్ఎస్ తో కాపు సీఎం నినాదాన్ని వినిపించేలా చేశారని అంటున్నారు.
చంద్రబాబు,పవన్ కలిసేలా చేసింది జగనే..
రెండు పార్టీలు కలిసిపోటీ చేయకపోతే ఏపీ అధోగతి పాలు అవుతుందని పవన్ ,చంద్రబాబులకు తెలిసివచ్చేలా చేసింది జగనే. రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు కలిసే పరిస్థితి కనిపిస్తుండటంతో.. ఒంటరిగా పోటీ చేయాలని జగన్ సవాల్ చేస్తున్నారు. ఇతర పార్టీలు నేరుగా పొత్తులు పెట్టుకుంటే.. ఓటమి ఖాయమన్న భయంతోనే జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.