మోసాలల్లో బాబాలు ఎప్పటికప్పుడు హై టెక్నాలజీ వాడుతున్నారు. అందులో ‘కమండలం తిరిగిన’ (చెయ్యి తిరిగిన) జైనుల్ల బుద్దీన్ బాబా అగ్రగన్యుడు. ఇతని భక్తులలో మహిళలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాడు. ఇంత గొప్ప రిజర్వేషన్లు అమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుచేయడం లేదు. మగవాళ్ళు రావడానికి వీల్లేదు. మగాళ్ళకు బదుకు, వాళ్ళ ఆడవాళ్ళను పంపమంటాడు. డబ్బుకు ఆశపడే ఆడవాళ్ళు ఇతని టార్గెట్.
ఆశతో వచ్చిన మహిళలకు ముందుగా సృష్టి రహస్యాలగురించి హితబోధ చేస్తాడు. మలముత్రాలు నిండిన ఈ దేహం అశాశ్వతం అంటాడు. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంటరాదు, నడుమ బట్ట కడితే నగుబాటు అని కర్మ సిద్ధాంతాలు వల్లిస్తాడు. మలినమైన ఈ దేహం మీది మురికి బట్టలు ఉండరాదు అంటాడు.
ద్యాసం మొత్తం దేవత మీదే ఉండాలి అంటాడు. అలా మనసా, వాచా త్రికరణ శుద్దితో పూజలు చేస్తే కోరుకుంది సిద్దిస్తుంది అని నమ్మబలుకుతాడు. అనారోగ్యం ఉన్నవాళ్ళకు రోగాలు పోతాయి, డబ్బు కావాలి అనుకునే వాళ్ళను ధనలక్ష్మీ కటాక్షిస్తుంది. మీరు రూపాయి పెట్టి లాటరి టికెట్ కొంటే, ఆ కోటి రూపాయలు మీకే వస్తాయి. మీరు అలా రోడ్డు మీద వెళ్ళుతుంటే ఎవరో పడేసుకున్న బంగారం మీకే దక్కుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటాడు.
”మీ ద్యాస ద్యానం మీదే ఉండాలి. ఎవ్వరైనా తమ నగ్న దేహాన్ని చూస్తున్నారా? ఎవ్వరైనా సెల్ ఫోన్లో బంధిస్తున్నారా లాంటి పాపిష్టి ఆలోచనలు రావొద్దు. అలా వస్తే మీ మనసులో కల్మషం ఉందని అర్థం. అప్పుడు మిమ్మల్ల్ని దేవి కటాక్షించదు” లాంటి పవర్ ఫుల్ మాటలు చెపుతాడు.
ఆ భక్తులలలో ముందు వరుసలో కూర్చున్న అతని ‘కిరాయి వేశ్య అడ భక్తులు’ తాము లోగడ ఆ పూజ చేసినందుకే బాగా సంపాదించాము అని సాటి భక్తులకు ఆశలు కల్పిస్తారు. కిరాయి వేశ్య అడ భక్తులు ముందుగా చక చక బట్టలు ఇప్పేస్తారు. మిగతా ఆడవాళ్ళను కూడా బట్టలు విప్పమని నమ్మబలుకుతారు. అలా ఓ నలుగురు బట్టలు విప్పేసరికి మిగతా భక్తులు కూడా బట్టలువిప్పి పూజలో కూర్చుంటారు.
అక్కడి నుంచి అసలు కార్యక్రమం మొదలవుతుంది. వాళ్ళను షూట్ చేసే వాళ్ళు రంగంలోకి దిగుతారు. వాళ్ళ అంగగాలను ఎలా షూట్ చేయాలో అంతకుముందే ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. పూజ ప్రసాదం, చీరలు పంపుతామని వాళ్ళ సెల్ నెంబర్లు తీసుకుంటారు.
అక్కడి నుంచి అసలు రంగు బయటపడుటింది. గుర్తు తెలియని వ్యక్తులు మహిళకు ఫోన్ చేసి ‘నేను ఆశ్రమం వెనుక తోటమాలిని. నీ నగ్నచిత్రాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని మీ కుటుంబ సభ్యులకు పంపకూడదు అనుకుంటే ఒక రేట్, సోషల్ మీడియాలో పెట్టకూడదు అనుకుంటే మరో రేటు, వాటిని వాల్ పోస్టర్ లుగా ప్రింట్ చేసి వీధి లో అతికించకూడదు అనుకుంటే మరో రేటు’ అని అమౌంట్ వివరాలు చెపుతారు. సాంపిల్ గా కొన్ని ఫోటోలు పంపుతారు.
ఆ విషయం జైనుల్ల బుద్దీన్ బాబాకు చెప్పినా, పోలీసులకు చెప్పినా ఆ ఫోటోలు పేస్ బుక్ లో పెడతాను అని బ్లాక్ మెయిల్ చేస్తారు. జైనుల్ల బుద్దీన్ బాబా పిక్చర్ లోకి రాడు. అతని అనుచరులే బయటివాల్లలా నటిస్తూ ఇదంతా చేస్తారు.
అందంగా ఉన్న ఆడవాళ్ళను ఏకంగా తమ కోరికలు, బాబా కోరికలు తీర్చాలని బెదిరిస్తారు. అటు మింగలేక, ఇటు కక్కలేక ఆ మహిళలు నరకం అనుభవిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ బాబా ఆగడాలకు బలయ్యిన మహిళలు ఎందరో. ఈ మధ్య ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఈ అరాచకం ఎక్కడో కాదు, హైదరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్లలో జైనుల్లబుద్దీన్ బాబా ఆశ్రమం ఉంది. ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్, ఇతర మహిళా సంఘాలు స్పందించాలని పీడిత మహిళలు కోరుతున్నారు. ఇంత ఘోరం జరుగుతున్నా ఇది మహిళ కమిషన్ దృష్టికి రాకపోవడం గమనార్హం! దీనిని సుమోటగా గా తీసుకుని జైనుల్లాబుద్దీన్ బాబా, అతని అనుచరులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేస్తే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొందరు మహిళలను ఈ దొంగ బాబా రాజకీయ వేత్తలకు బుక్ చేసినతులు పుకార్లు కూడా ఉన్నాయి.
౦౦౦