శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకున్నారు అన్న వార్త మన దిన చర్యలో ఓ భాగమయింది. అదికూడా గిట్టనివాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెపితేనే కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. లేకపొతే తమ విధులు సరిగ్గా నివహించక దొంగలను వదిలేస్తున్నారు. లేదా పట్టుకున్న కేసుల్లోంచి సగం కేసులు అనధికారికంగా సెటిల్మెంట్ చేసి అందినంతా నొక్కేసి, అందరు సమానంగా పంచుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని కేసులు మాత్రమే అధికారికంగా రికార్డ్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి కేసులు రోజు రోజుకు పెట్రోల్ ధరలా ఒక్క హైదరాబాద్ లోనే పెరుగుతున్నాయి కాబట్టి.
ఈ రోజు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా తీసుకువచ్చిన 528 గ్రాముల బంగారం ముద్దలను కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 47 లక్షలు ఉంటుంది అని చెప్పారు. నిండుతుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సామాన్యంగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఒంటరిగా రారు. నలుగురు లేదా ఐదుగురు గ్రూప్ గా వస్తారు.వాళ్ళే కావాలని అధికారులకు ఫోన్ చేసి తక్కువ బంగారం తీసుకుని వస్తున్నా ఒకడిని పట్టిస్తారు. అధికారుల దృష్టి మరల్చుతారు. ఈ హడావుడిలో ఎక్కువ బంగారం తీసుకొస్తున్న వాళ్లు తప్పించుకుంటారు. ఆ తర్వాత ఆ అధికారుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ ముఠా నాయకులకు బాగా తెలుసు.
అయితే ఇక్కడ ఒకటి గమనిచాలి. ఒక సారి అరెస్ట్ అయినవాళ్ళు పదే పదే అరెస్ట్ అవుతున్నారు. అంటే వాళ్లు చట్టం నుంచి చాలా తేలికగా తప్పించుకుంటున్నారని అర్థం. దేశంలో మరెక్కడా లేని విధంగా మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే స్మగ్లింగ్ గోల్డ్ ఎక్కువగా వస్తోంది అని తెలుస్తోంది. దినివేనక ఉన్నత అధికారులు, రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది. ఎవరికి వాటాలు ఏంటో ముందే నిర్ణయిస్తారు. ఇది ఒక గొలుసు కట్టు వ్యవహారం. ఎక్కడినుంచి మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో కస్టమ్స్ అధికారులకే తెలియదు.
విదేశాల నుంచి కొందరు కాయిన్ కలెక్టర్ లు నాణాలు సేకరించే హాబిలో భాగంగా పురాంతన కాయిన్ లు తీసుకుని వస్తారు. వాళ్ళ మీద మాత్రం కస్తుమ్స్ అధికారులు తమ ప్రతాపం చూపిస్తారు. కానీ ఆ ప్రతాపం గోల్డ్ స్మగ్లింగ్ మీద చూపితే రోజుకు కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది అని ప్రయాణికులు అంటున్నారు.
౦౦౦